శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (15:02 IST)

అదే పనిగా కన్ను అదురుతుంటే? కుడి-ఎడమ కనులు అదిరితే ఫలితం ఏమిటి?

కన్ను అదిరితే వామ్మో ఏం జరుగుతుందోనని భయపడుతుంటాం. కానీ ఈ కన్ను అదరటంపై మన భారత దేశమే కానీ విదేశాలు కూడా విశ్వాసం పెట్టుకున్నాయి. ఇంకా కన్నుశాస్త్రాన్ని కూడా అనుకరిస్తున్నాయి. మన భారతీయులైతే మగవారికి

కన్ను అదిరితే వామ్మో ఏం జరుగుతుందోనని భయపడుతుంటాం. కానీ ఈ కన్ను అదరటంపై మన భారత దేశమే కానీ విదేశాలు కూడా విశ్వాసం పెట్టుకున్నాయి. ఇంకా కన్నుశాస్త్రాన్ని కూడా అనుకరిస్తున్నాయి. మన భారతీయులైతే మగవారికి కుడి కన్ను అదిరితే మంచి జరుగుతుందని, అదే ఆడవారికైతే ఎడమకన్ను అదిరితే మంచి జరుగుతుందని చెప్తున్నారు. 
 
అదే ఆడవారికి కుడి కన్ను అదిరితే లేనిపోని సమస్యలు వచ్చిపడతాయని చెప్తున్నారు. చైనీయులదైతే మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. వారు మగవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని, ఆడవారికి కుడికన్ను అదిరితే మంచిదని విశ్వసిస్తారు. అయితే అమెరికా విశ్వాసం ప్రకారం ఎడమ కన్ను అదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు, బంధువులు ఇంటికి వస్తారని నమ్ముతారు. అదే కుడి కన్ను అయితే ఆ ఇంట్లో త్వరలో శిశువు జన్మిస్తుందని నమ్ముతారు. 
 
చైనా కంటి శాస్త్రం ప్రకారం.. ఎడమ కన్ను అయితే గొప్ప వ్యక్తి ఇంటికొస్తారని, కుడి కన్ను అయితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని భావిస్తారు. అర్థరాత్రి 1 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు ఎడమ కన్ను అదిరితే కంగారు పడేది ఏదో జరుగుతుంది, కుడి కన్ను అయితే ఎవరో మీ గురించి ఆలోచిస్తారు. మధ్యాహ్నం 1-3 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కుడి కన్ను అయితే మీ కుటుంబంలో స్వల్ప సంతోషం నెలకొంటుంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే మీరు త్వరలో కొంత ధనం కోల్పోతారు, కుడి కన్ను అదిరితే మీరు ప్రేమిస్తున్న వారి గురించి తీవ్రంగా ఆలోచిస్తారు.
 
ఏదైతేనేం.. కన్నుశాస్త్రం ప్రకారం ఎక్కువ సేవు అలా కళ్లు అదురుతుంటే మాత్రం కచ్చితంగా ఏదో ఒక అశుభం కలుగుతుందట. కానీ సైన్స్ ప్రకారం పోషకాహార లోపం వల్లే కాకుండా, నిద్రలేమి, కాలుష్య పూరిత వాతావరణం, కంటి సంబంధ సమస్యలు ఉన్నా అలా కళ్లు అదురుతాయట. కనుక ఒకటి కన్నా ఎక్కువ రోజుల పాటు నిరంతరాయంగా కళ్లు అలా అదురుతుంటే వెంటనే సంబంధిత వైద్యులను కలవడం ఉత్తమం.