శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (11:58 IST)

మగవారికి ముక్కుకు ఎడమవైపు పుట్టుమచ్చ వుంటే.. పరస్త్రీల?

మగవారి కడుపుపై పుట్టుమచ్చ వుంటే.. వారు అసూయ గుణం కలిగినవారుగా వుంటారు. కడుపుకు ఎడమవైపు పుట్టుమచ్చ వుంటే మంచి గుణవంతులుగా వుంటారు. స్వయంకృషితో రాణించాలనుకుంటారు. బొడ్డుపై మగవారికి పుట్టుమచ్చ వుంటే.. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుడిచేతి భుజంపై పుట్టుమచ్చ కలిగిన పురుషులు.. చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతారు. 
 
కుడిచేతిలో పుట్టుమచ్చ వుంటే వారికి స్నేహితులు అధికంగా వుంటారు. కుడిఛాతిపై మచ్చ వుంటే.. వారికి సాధారణ జీవితం వుంటుంది. ఎడమఛాతిపై మచ్చ వుంటే.. మగ సంతానం అధికం కలిగివుంటారు. మహిళల పట్ల ప్రేమగా ఆప్యాయతగా ప్రవర్తిస్తారు. 
 
కంటి కుడి కనురెప్పపై మచ్చ వుంటే.. అదృష్టమైన భార్య లభిస్తుంది. ఇరు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ వుంటే.. దీర్ఘాయుష్షు చేకూరుతుంది. నుదుటి కుడిభాగాన మచ్చ వుంటే అనూహ్య ధన రాబడి వుంటుంది. ముక్కుపై పుట్టుమచ్చ కలిగిన పురుషులు సకల సౌభాగ్యాలను పొందుతారు. ముక్కుకు కుడిభాగంలో మచ్చ వుంటే అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. 
 
అదే ముక్కుకు ఎడమవైపు మచ్చ వుంటే ఎవ్వరినీ అంత సులభంగా నమ్మరు. పరస్త్రీల పట్ల ఆసక్తి కలిగివుంటారు. చెవికి ఎడమవైపున మచ్చ వుంటే మహిళల పట్ల అప్రమత్తంగా వుండాలి. రెండు చెవులపై మచ్చవుంటే అదృష్టవంతులు. ఇతరులను ఆకట్టుకునే అందాన్ని కలిగివుంటారు. గొంతు భాగంలో మచ్చ వుంటే వివాహం ద్వారా ఆస్తులు వచ్చి చేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.