1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (15:19 IST)

సోమవారం రోజున ఎలాంటి పనులు చేయాలంటే..?

చాలా మందికి ఏ వారం ఎలాంటి పనులు చేయాలన్న అంశంపై సందిగ్ధత నెలకొనివుంటుంది. ఇది వారిని గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా.. ఫలానా వారం అది చేయకూడదు.. ఈ పని చేయకూడదంటూ చుట్టుపక్కల వారు చెప్తుంటారు. ఇలాంటి ఉచిత సలహాలు మరింత గందరగోళానికి గురి చేస్తుంటాయి. ఇదే అంశంపై జ్యోతిష్య నిపుణులు ఇలా చెపుతున్నారు.
 
పైకప్పులు వేయడం, సంగీతం, నృత్య, నాటకాలు ప్రారంభించడం, స్తంభ ప్రతిష్ట చేయడం, భూసంబంధ కార్యాలు పూర్తి చేయడం, తెల్లని వస్త్రాలు ధరించడం, వెండి వస్తువులు ఉపయోగించడం, ముత్యాలు ధరించడం, ముత్యం, నూతులు, కాలువలు, చెఱువులు తవ్వడం, జలం, ఉపనయనం చేయడం, భూమి కొనుగోలు చేయడం, దక్షిణ దిక్కు ప్రయాణించడం, సమస్త వాస్తు కర్మలు చేయవచ్చని పండితులు పేర్కొంటున్నారు. 
 
అయితే, ఈ పనులు వారివారి నమ్మకానికి అనుగుణంగా కూడా చేసుకోవచ్చు.. చేయక పోవచ్చని వారు వివరణ ఇస్తున్నారు. ఇవే పనులను ఖచ్చితంగా సోమవారమే చేయాలన్న నిబంధన ఏదీ లేదని కూడా వారు చెప్పుకొస్తున్నారు.