శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (11:39 IST)

ఇంట్లో చెప్పులేసుకుని తిరిగితే ఏమౌతుంది?

బయటికి వెళ్ళేటప్పుడు ఓకే కానీ.. ఇంట్లోనే ప్రస్తుతం చాలామంది చెప్పులేసుకుని వాక్ చేస్తున్నారు. అయితే ఈ పద్ధతి సరికాదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇంటి లోపల వాడేందుకు ఎంతటి శుభ్రమైన చెప్పులు వాడినా

బయటికి వెళ్ళేటప్పుడు ఓకే కానీ.. ఇంట్లోనే ప్రస్తుతం చాలామంది చెప్పులేసుకుని వాక్ చేస్తున్నారు. అయితే ఈ పద్ధతి సరికాదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇంటి లోపల వాడేందుకు ఎంతటి శుభ్రమైన చెప్పులు వాడినా.. దానివల్ల అశుభ ఫలితాలే చేకూరుతాయని వారు చెప్తున్నారు. ఇంట్లోని పూజగది, స్టోర్ రూమ్, బంగారం దాచిపెట్టే బీరువాలుండే ప్రాంతాల్లో కూడా చెప్పులేసుకుని తిరగడం ఏ మాత్రం సరికాదు. 
 
అంతేకాదండోయ్.. ముఖ్యంగా వంటగదిలో చెప్పులేసుకుని తిరగడం మహాపాపం. అందుకే ఇంట్లో పూజ గది దగ్గరే కాదు.. పాదరక్షలతో ఇంట్లో తిరగడం మంచిది కాదని ఆ ఇంటికి అరిష్టమని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు. అంతేగాకుండా ఇంట్లో చెప్పులేసుకుని తిరిగితే దరిద్రం తప్పదంటున్నారు.
 
అలాగే వాడిన షూలు, సాక్స్‌లు ఇంట్లోకి తేకూడదు. వాటిని బయటే వుంచాలి. వాడిన చెప్పులు, బూట్లు, సాక్సులు ఇంట్లోకి తెచ్చే అనారోగ్య సమస్యలతో పాటు.. ఆధ్యాత్మికపరంగా సానుకూల ఫలితాలను ఇవ్వవు.