1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (10:29 IST)

సూర్య గ్రహణం.. ధనుస్సు రాశి వారు ఇలా చేయాల్సిందేనా?

సూర్య గ్రహణం గురువారం కొనసాగుతోంది. డిసెంబరు 26 గురువారం నాడు మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా, మోక్షకాలం ఉ.11.11 గంటలు. మూడు గంటల పాటు ఉండే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వుంటుంది. 
 
ఈ గ్రహణాన్ని ధనుస్సు రాశి వారు ఈ గ్రహణం చూడరాదని, ముఖ్యంగా మూల నక్షత్రం వారు ఈ గ్రహణం చూస్తే అనారోగ్య హేతువని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రహణం ఏ రాశి లో సంభవిస్తుందో ఆ రాశి వారికి దోషం అని ధర్మ శాస్త్రం, అనారోగ్యానికి కారణమవుతుందని జ్యోతిష పండితులు వివరిస్తున్నారు. కాబట్టి దోష పరిహారాలు చేసుకొవాలని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. 
 
ధనుస్సు రాశి వారు బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి. దానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలని అంటున్నారు. గ్రహణం విడిచిన తర్వాత తలంటు స్నానం చేసి సమీపంలోని దేవాలయం కానీ, నదీ తీరంలో కానీ బ్రాహ్మణులతో సంకల్పం చేయించుకోవాలి. ఒకవేళ బ్రాహ్మణులు అందుబాటులో లేకపోతే సంకల్పం చేసుకుని దానం చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.