మీరు టెన్షన్ పార్టీనా? ఐతే తప్పక చదవండి!
మీరు టెన్షన్ పార్టీనా? అయితే ఈ కథనం చదవండి. ఆరోగ్యంగా ఉండాలంటే కోపాన్ని తగ్గించుకోవాలని చెబుతున్నారు సైకాలజిస్టులు. జీవితం సాఫీగా జరిగిపోవాలంటే అన్నీ సమస్యలను పరిష్కరించే దిశగా మన ఆలోచనలు వుండాలని వారు సూచిస్తున్నారు. కోపం ఆరోగ్యానికి హానికరం. ఫాస్ట్ లైఫ్‌కు అలవాటుపడి చిన్న చిన్న విషయాలకు కోపపడితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఉదాహరణకు మానసిక ఒత్తిడి, గుండెపోటు, రక్తపోటు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కోపం అధికమైతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు తప్పవు.
గుండెపోటు : కోపం కారణంగా ఏర్పడే దడతో హార్ట్ బీట్ అధికమవుతుంది. ఇలా హార్ట్ బీట్ పెరగడం ద్వారా గుండెపోటుతో ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్రలేమి : కోపం ఎక్కువైతే శరీరంలోని హార్మోన్లు చురుగ్గా ఉంటాయి. ఇందుచేత నిద్రపట్టదు. ఇంకా శరీరానికి కావాల్సిన విశ్రాంతి లభించదు. సులభంగా అనారోగ్యం పాలవుతారు.
హై బీపీ: కోపంతో హైబీపీ రాకతప్పదు. ఎప్పుడల్లా కోపపడతారో అప్పుడల్లా శరీరంలో రక్తపోటు కూడా అధికమవుతోంది. హైబీపీతో గుండెకు ముప్పు తప్పదు.
శ్వాస సమస్యలు : ఎక్కువగా కోపపడితే ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తప్పువు.