గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:17 IST)

నలుపు రంగు దుశ్శకునం కావచ్చేమో కానీ..?

1. నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మ అవుతుంది..
చీకటితో పోరాడితేనే ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది..
మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది..
జీవింతో పోరాడితేనే.. మానవత్వం ఉన్న మనిషిలా మారుతావు..
 
2. నలుపు రంగు దుశ్శకునం కావచ్చేమో కానీ..
ప్రతీ బ్లాక్ బోర్డు.. విద్యార్థి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుతుంది.
 
3. అవసరంలో ఉండి సహాయం కోరేవారిని మనం చిన్నచూపు చూడకూడదు..
చేతనైతే చెయ్యాలి లేదా తగు మార్గం చూపాలి.
ప్రతీ మనిషికి ఇతరుల వలన సహాయం అవసరం తప్పక వస్తుంది...
రేపు మనకూ ఆ అవసరం రావొచ్చు.
 
4. మనిషి మనిషిగా బ్రతకడం మానేసి చాలా కాలం అయ్యింది..
ఇప్పుడు కేవలం డబ్బు కోసమే బ్రతుకుతున్నారు..
 
5. ఆకలితో ఉన్న కడుపు
ఖాళీగా ఉన్న జేబు
ముక్కలైన మనసు..
ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి..