శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (10:02 IST)

వినాయక పూజ ఎలా చేయాలంటే?

వినాయక పూజకు సన్నాహాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకుని స్నానం చేయాలి. ద

వినాయక పూజకు సన్నాహాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకుని స్నానం చేయాలి. దేవుని గదిని శుభ్రం చేసుకుని అక్కడ పరిశుభ్రమైన పీటను వేసి దానిపై వినాయకుడి విగ్రహాన్ని పెట్టాలి.
 
వినాయకునికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా వీటిని తయారుచేసుకోవాలి. వినాయకుని విగ్రహం ఎదుట ఆసనం ఏర్పాటు చేసుకుని కొంచెం బియ్యాన్ని పోసుకుని దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచుకుని దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. ఆ తరువాత ఆ పాత్రలో కొన్ని అక్షింతలు, పువ్వులు వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. 
 
ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారుచేసుకోవాలి. పూజకు ముందుగా ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరణ ఉంచుకుని మరో చిన్న ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు వినాయకునికి వ్రతకల్పం ఎలా చేయాలో తెలుసుకుందాం. 
 
ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమః - విష్ణవే నమః - మధుసూదనాయ నమః - త్రివిక్రమాయ నమః - వామనాయ నమః - శ్రీధరాయ నమః - హృషీకేశాయ నమః - పద్మనాభాయ నమః - దామోదరాయ నమః - సంకర్షణాయ నమః - వాసుదేవాయ నమః - ప్రద్యుమ్నాయ నమః - అనిరుద్ధాయ నమః - పురుషోత్తమాయ నమః - అధోక్షజాయ నమః - నారసింహాయ నమః - అచ్యుతాయ నమః - జనార్దనాయ నమః - ఉపేంద్రాయ నమః - హరయే నమః - శ్రీకృష్ణాయ నమః.