శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (12:12 IST)

మంగళవారం శ్వేతార్క హనుమను పూజిస్తే?

గణపతి స్వరూపమైన తెల్లజిల్లేడు వేరును శ్వేతార్క గణపతిగా పూజిస్తుంటారు. శ్వేతార్క మూలంపై వినాయకుని ఆకారం సహజసిద్ధంగా ఏర్పడుతుంటుంది. గణపతి విశిష్టలతో కూడిన ఈ శ్వేతార్క మూలంపై హనుమ రూపాన్ని తీర్చిదిద్దిం

గణపతి స్వరూపమైన తెల్లజిల్లేడు వేరును శ్వేతార్క గణపతిగా పూజిస్తుంటారు. శ్వేతార్క మూలంపై వినాయకుని ఆకారం సహజసిద్ధంగా ఏర్పడుతుంటుంది. గణపతి విశిష్టలతో కూడిన ఈ శ్వేతార్క మూలంపై హనుమ రూపాన్ని తీర్చిదిద్దించి, ఆ రూపానికి మూల మంత్రంతో ప్రాణప్రతిష్ట జరిపి పూజించడం వలన పిల్లలకు బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి.
 
జాతకంలో ఏర్పడే బాలారిష్టాలు పన్నెండేళ్ల వయసు నిండేంత వరకు పిల్లలను పీడిస్తుంటాయి. ఈ దోషాల కారణంగా పిల్లలు తరచుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అంతేకాకుండా ప్రమాదాలకు, భయాలకు లోనవుతుంటారు. కాబట్టి ఈ దోషాలు తొలగించడానికి శ్వేతార్క ఆంజేనేయ స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
తెల్లజిల్లేడు వేరుపై హనుమ రూపాన్ని తయారుచేసుకుని సింధూరంతో అలకరించి పూజ మందిరంలో ఉంచుకుని నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. ఈ పూజలో హనుమాన్ చాలీసాను పదకొండుసార్లు పఠించాలి. ఇలా చేయడం వలన హనుమ అనుగ్రహం లభించడంతో పాటు దోషాలు కూడా తొలగిపోతాయి.