గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (11:55 IST)

మంగళవారం రోజున హనుమంతునికి ఇలా పూజలు చేస్తే?

సాధారణంగా మనసులోని కోరికలు లేని వారంటూ ఉండరు. ఆ కోరికలు నెరవేరడానికి భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. అంతేకాకుండా వారికి ప్రీతికరమైన సేవలు, పూజలు చేస్తుంటారు. జీవితంలో విద్యా, ఉద్యోగం, వివాహనం, సౌభాగ్యం,

సాధారణంగా మనసులోని కోరికలు లేని వారంటూ ఉండరు. ఆ కోరికలు నెరవేరడానికి భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. అంతేకాకుండా వారికి ప్రీతికరమైన సేవలు, పూజలు చేస్తుంటారు. జీవితంలో విద్యా, ఉద్యోగం, వివాహనం, సౌభాగ్యం, సంతానం, సంపద, ఆరోగ్యం, ఆయుష్షు అనేవి అందరికి ఆశించేవే. ఈ కోరికలు నెరవేరడానికి ఇష్ట దైవానికి పూజలు చేస్తుంటారు.
 
హనుమ ఆరాధనతో కూడా మనసులోని కోరికలు నెరవేరుతాయని పురాణాలలో చెప్పబడింది. హనుమంతుని పూజించడం వలన శని, కుజ దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు. బియ్యం, గోధుమలు, పెసలు, మినుములు, నువ్వుల పిండితో తయారుచేసిన ప్రమిదలో దీపాన్ని వెలిగించుకుని హనుమంతుని స్మరిస్తూ ఆ దీపాన్ని దానం చేయాలి. 
 
ఇలా చేయడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని ప్రతిమ యందు ముందు దీపదానం చేయడం వలన వ్యాధులు, గ్రహ బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాల్లో స్పష్టం చేయబడుతోంది.