Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పూజగదిలో శివలింగం వుంటే... స్నానం చేసిన తర్వాతే?

బుధవారం, 12 జులై 2017 (17:53 IST)

Widgets Magazine

నవగ్రహాల్లో బుధుడికి ప్రీతికరమైన మరకతాన్ని ధరించడం ద్వారా శుభఫలితాలు వుంటాయి. అలాగే మరకతంతో తయారైన శివ లింగాన్ని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కోరిన వరాలు నెరవేరుతాయి. నవరత్నాల్లో ఒకటైన మరకతానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. అలాంటి మరకతాన్ని లింగ రూపంలో పూజించడం ద్వారా అన్నీ రంగాల్లో రాణిస్తారు.
 
విద్య, ఆరోగ్యం, ఉన్నత పదవులు లభించాలంటే.. మరకత లింగాన్ని పూజించడం ద్వారా ప్రాప్తిస్తాయి. అలాగే వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే.. మరకత లింగాన్ని పూజించాలి. అంతేగాకుండా మరకత లింగాన్ని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఈ లింగాన్ని నిష్ఠతో ప్రార్థించే వారికి ఒత్తిడి మాయమవుతుంది. అలాగే ఇంటనున్న ప్రతికూల శక్తులను తొలగిపోతుంది. అలాగే అనుకూలత చేకూరుతుంది. 
 
ఈ మరకత లింగమో లేకుంటే వేరేదైనా శివలింగం ఇంట్లో వుండినట్లైతే... నియమం ప్రకారం పూజించాలి. శివలింగానికి ముందుగా వీరు, పాలు, తేనె, పెరుగు, పంచామృతాలతో అభిషేకించాలి. ఆపై బిల్వ పత్రాలు, చందనం, విభూతితో అభిషేకించి.. దీపారాధన చేయాలి. పూజ గదిలో శివలింగం వుంటే స్నానం చేశాకే ఎవరైనా పూజగదిలోకి ప్రవేశించాలి. 
 
మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. పండ్లు, పువ్వులతో రోజూ అర్చించాలి. శక్తిమేరకు ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ప్రదోషకాలంలో తప్పక శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా శివలింగాన్ని ఇంట వుంచి పూజ చేయడం ద్వారా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు వుండవు. వృత్తిపరమైన అభివృద్ధి వుంటుంది. ఇంట పండగ వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. మోక్షం సిద్ధిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ఆధార్ తప్పనిసరి

తిరుమలలో బ్రేక్‌ దర్శనాలకు దరఖాస్తు చేసుకునే భక్తులు జూలై 11వ తేదీ నుంచి తప్పనిసరిగా ...

news

శ్రీవారి కాలినడక భక్తుల దర్శనంలో రేషన్... 20 వేల టిక్కెట్లు మాత్రమే(వీడియో)

తిరుమల అంటేనే జనసంద్రం. ఎప్పుడూ జనంతో నిండిపోతుంటుంది. అలాంటి తిరుమలకు కాలి నడకన వచ్చే ...

news

జూలై 10 నుంచి తిరుమలలో అద్దె గదులకు జిఎస్టి వర్తించదు...

కేంద్ర ప్రభుత్వ జిఎస్టి ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపై పడుతుందని అందరూ భావించారు. ...

news

వివాహాలు ఎన్ని? గాంధర్వ వివాహం అని దేన్నంటారు?

మలి వేదకాలంలో వివాహ పద్దతులు -8 రకాలు. అవి ఆమోదితాలు 4. అనామోదితాలు 4. 1. బ్రహ్మ ...

Widgets Magazine