శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 21 జనవరి 2017 (04:32 IST)

మగాళ్లను హెల్ప్‌లెస్‌గా, మహిళలను హోప్‌లెస్‌గా మార్చేది ఏది?

మగాళ్లను హెల్ప్‌లెస్‌గా, మహిళలను హోప్‌లెస్‌గా మార్చేది ఏది? అనే ప్రశ్నకు వివిధ దేశాల డాక్టర్లు ఒకే సమాధానం చెబుతున్నారు. ఒకరిని నిస్సహాయులుగా, మరొకరిని నిరాశావాదులుగా మార్చే ఆ మహత్తర శక్తి కుంగుబాటు (డిప్రెషన్)కే ఉందని వీరు ఘంటాపథంగా తేల్చి చెబుతున్న

మగాళ్లను హెల్ప్‌లెస్‌గా, మహిళలను హోప్‌లెస్‌గా మార్చేది ఏది? అనే ప్రశ్నకు వివిధ దేశాల డాక్టర్లు ఒకే సమాధానం చెబుతున్నారు. ఒకరిని నిస్సహాయులుగా, మరొకరిని నిరాశావాదులుగా మార్చే ఆ మహత్తర శక్తి కుంగుబాటు (డిప్రెషన్)కే ఉందని వీరు ఘంటాపథంగా తేల్చి చెబుతున్నారు. తీవ్రమైన నిరాశా నిస్పృహల బారిన పడుతున్న మగవారు తక్షణ పరిష్కారంకోసం చూస్తుండగా, మహిళలు తమ అనుభూతులను గురించి ఇతరులతో పంచుకోవాలనుంకంటున్నారని తాజా పరిశోధనలు చెప్పాయి. 
 
ఆడవారి కంటే మగాళ్లు మూడు నాలుగు రెట్లు అధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ వారు మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలనుకోవడం లేదని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ డాక్టర్ జాన్ బ్యారీ చెబుతున్నారు. దీనికి కారణం సైకాలజిస్టులు తమవద్దకు వచ్చే నిస్పృహకు గురైన పురుషుల సమస్యలను పరిష్కరించడం కంటే వారితో మాట్లాడటానికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుండటమేనట. 
 
ఈ బుధవారం రాత్రి  పదో తరగతి చదువుతున్న సంప్రీత్ బెనర్జీ అనే విద్యార్థి ఫేస్‌బుక్‌లో గుడ్‌బై మెసేజ్ పెట్టి తర్వాత ఉరివేసుకుని మరణించిన ఘటన నేపథ్యంలో వైద్యలు తాజా పరిశోధన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో సరిగా రాయనందుకు టీచర్ అందరిముందూ తనను అవమానించాడన్న వ్యాకులత తోటే సంప్రీత్ ఈ ఘాతుకాన్ని తలపెట్టాడు.
 
ఈ ఉదంతాన్ని విశ్లేషించిన మెంటల్ హెల్త్ పౌండేషన్ డాక్టర్ జైరంజన్ రామ్ మాట్లాడుతూ, యువకులను మానసిక చికిత్సా సెషన్లకు హాజరయ్యేలా చూడటం చాలా కష్టమని చెప్పారు. 
 
యువకులు కానీ, 35 సంవత్సరాల వయస్సున్న పురుషులు కానీ కుంగుబాటును ఒక సమస్యగా అసలు చూడటం లేదనన్నారు. పురుషులు తమ అనుభూతులను బయటకు చెప్పలేరు, తమ భావోద్వేగ సమస్యలతో వారు సరిగా వ్యవహరించలేరు. వాస్తవ సమస్యలే తమ డిప్రెషన్‌కు కారణమని ఆపాదిస్తారు. వాటి గురించి మాట్లాడబోతే ప్రతిఘటిస్తారు అని డాక్టర్ రామ్ చెబుతున్నారు. పైగా కలకత్తా వంటి నగరాల్లో మేల్ థెరపిస్టులు కలికానిక్కూడా కనిపించరని, ఈ నేపథ్యంలో పురుషులు మహిళా థెరిపిస్టుల వద్ద తమ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు రావడం లేదని రామ్ చెప్పారు. 
 
కాకతాళయంగా, పురుషులు, మహిళలు తమ కుంగుబాటుతో వ్యవహరించడంలో భిన్నమార్గాలను అవలింబిస్తున్నారట. మహిళలు ముందుగా తమ ఉద్వేగాలను బయటకు చర్చిస్తారని, తర్వాత వాటిపై నిర్ణయం తీసుకుంటారని అదే పురుషులైతే తమ సమస్యలకు పరిష్కారంగా మద్యపానం అలవాటు చేసుకుని తమనుతాము విచ్ఛిన్నపర్చుకుంటున్నారని డాక్టర్ రామ్ చెప్పారు.

కుంగుబాటుకు గురైన పురుషులు తరచుగా తాగడం, పొగ పీల్చడం పెరుగుతుందని, ఊహాలోక సంబంధాలలో వారు మునిగితేలుతుంటారని, మహిళలు మాత్రం తమ సమస్యలను స్నేహితుల వద్దా, కుటుంబ సభ్యుల వద్దా చెప్పుకుంటారని, అయితే ఆ తర్వాత వారు అదేపనిగా తినడం అలవాటు చేసుకుని లావైపోతారని, ఆ విధంగా మరిన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారని వైద్యులు చెబుతున్నారు.