గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By chj
Last Modified: శనివారం, 12 మే 2018 (21:44 IST)

ధ్యానం వల్ల కలిగే మేలు...

మానవుని మెదడు అనంతమైన విశ్వానికి ప్రతినిధి. శరీర క్రియలను మెదడు నియంత్రిస్తుంది. మనిషి ఒక పని చేయాలా.. వద్దా.. అనే సంగతిని మెదడు నిర్దేశిస్తుంది. మెదడు అతి సూక్ష్మమైన నాడీ వ్యవస్థ మాత్రమే కాదు ఈ విశ్వానికి ప్రతీక. గ్రహాలను సైతం మింగి వేయగల బ్లాక్ హోల

మానవుని మెదడు అనంతమైన విశ్వానికి ప్రతినిధి. శరీర క్రియలను మెదడు నియంత్రిస్తుంది. మనిషి ఒక పని చేయాలా.. వద్దా.. అనే సంగతిని మెదడు నిర్దేశిస్తుంది. మెదడు అతి సూక్ష్మమైన నాడీ వ్యవస్థ మాత్రమే కాదు ఈ విశ్వానికి ప్రతీక. గ్రహాలను సైతం మింగి వేయగల బ్లాక్ హోల్స్ విశ్వంలో ఉన్నట్లే మెదడులో కూడా బ్లాక్ హోల్స్ కారకాలు ఉంటాయి. అవి ప్రేరేపితం అయినపుడు మనసు ఖేదపడుతుంది. బుద్ది క్రమం తప్పుతుంది. 
 
మనిషి జీవక్రియలను, ప్రవర్తనను, ఆచరణను మెదడు నిర్ణయిస్తుంది. మెదడు పని చేయడం వల్లే మనసు ఏర్పడుతుంది. ఈ మనస్సే ధ్యానానికి మూలం. ధ్యానం చేయడం ద్వారా శరీరంలోని అవయవాలను, నాడీవ్యవస్తను, శక్తి కేంద్రాలను శుద్ది చేసుకుని శక్తివంతంగా మార్చుకోవచ్చు. అంతేకాదు అనంత విశ్వంగా శరీరాన్ని తీర్చిదిద్దవచ్చు. ఇంతటి మహత్తు ఉన్నది కాబట్టే మోక్ష సాధనకు ధ్యానమే మార్గమని విశ్వసించారు మన పూర్వీకులు. 
 
ఆత్మ సాక్షాత్కరానికి, పరమాత్మ దర్శనానికి ధ్యానాన్నే వేదికగా ఎంచుకున్నారు. శరీరంలోని అవయవాలు బ్రహ్మం వల్లే పని చేస్తున్నాయని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ బ్రహ్మం ఉత్తేజితం కావాలంటే ధ్యానానికి మించిన మార్గం లేదు.