శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 6 మే 2017 (15:40 IST)

''మార్పు'' ప్రేమకి సహజం.. దంపతుల మధ్య చిర్రుబుర్రులాట వద్దే వద్దు..

దంపతుల మధ్య చిర్రుబుర్రులాట ప్రస్తుతం కామనైపోయింది. ఇందుకు కారణం.. దంపతులిద్దరూ మాట్లాడుకోవడానికి సమయం లేకపోవడం. పెళ్ళికి ముందు ఒకరినొకరు ఆకట్టుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ పెళ్లయ్యాక

దంపతుల మధ్య చిర్రుబుర్రులాట ప్రస్తుతం కామనైపోయింది. ఇందుకు కారణం.. దంపతులిద్దరూ మాట్లాడుకోవడానికి సమయం లేకపోవడం. పెళ్ళికి ముందు ఒకరినొకరు ఆకట్టుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ పెళ్లయ్యాక చిర్రుబుర్రులు మొదలవుతాయి. ఇందుకు కారణం అర్థం చేసుకోకపోవడమే. ఆధునిక యుగంలో ఉద్యోగాల కోసం గంటలు వెచ్చించడం ద్వారా భాగస్వాముల మధ్య అగాధం ఏర్పడుతుంది.
 
అందుకే రోజులో ఒకరికోసం ఒకరు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారనేది చూసుకోవాలి. సమస్య వుంటే దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. అపోహలు, అనుమానాలకు తావివ్వకుండా పారదర్శకతను పాటించడం ద్వారా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవు. ఇల్లు, ఉద్యోగం, పిల్లలు వంటివి వేటికవే ప్రత్యేకం. ఒకదానికొకటి లింకు పెట్టకుండా చూసుకోవాలి. వాటికంటూ సమయాన్ని కేటాయించాలి. ఎక్కువ సమయం కుటుంబంతో గడపకపోయినా.. దొరికిన కొద్ది సమయాన్ని ఫ్యామిలీ కోసం.. భాగస్వామి కోసం వెచ్చించాలి. 
 
మార్పు.. ప్రేమకి వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే భాగస్వామి పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయతలు ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి. వయస్సు మీద పడినా.. ఇబ్బందులు, బాధ్యతలు వచ్చిపడినా.. వాటిని పక్కనబెట్టి అర్థగంటైనా భాగస్వామి కోసం గడపడం చేస్తే సుఖమయ జీవితం లభిస్తుందని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరి వ్యక్తిత్వంలోనూ మంచీచెడులు రెండూ ఉంటాయి. 
 
ప్రతికూలతలనే భూతద్దంలో చూడకండి. వీలైతే ఎదుటివారు అధిగమించడానికి వీలుగా మీకు చేతనైన సాయం అందించండి. వారి చెడును పక్కనబెట్టి వారిని ప్రోత్సహిస్తే తప్పకుండా భవిష్యత్తును పూలబాట చేసుకోవచ్చునని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.