శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ivr
Last Modified: మంగళవారం, 6 డిశెంబరు 2016 (21:15 IST)

స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ సరైనదేనా...?

యవ్వనంలో ఉన్నప్పుడు ఆడ మగల మధ్యలో ఏర్పడే ఆకర్షణ వద్దని అనుకున్నా వదలలేరు. అది సృష్టిధర్మం. అది సరైందా, కాదా! అని ఆలోచించాల్సిన అవసరం లేదు. పాశ్చాత్య దేశాలలో స్వతంత్రమైన శృంగారాన్ని పాటిస్తున్నారు. కుటుంబం, కట్టుబాట్లు అనే సమస్యల్లో ఇరుక్కుపోకుండా స

యవ్వనంలో ఉన్నప్పుడు ఆడ మగల మధ్యలో ఏర్పడే ఆకర్షణ వద్దని అనుకున్నా వదలలేరు. అది సృష్టిధర్మం. అది సరైందా, కాదా! అని ఆలోచించాల్సిన అవసరం లేదు. పాశ్చాత్య దేశాలలో స్వతంత్రమైన శృంగారాన్ని పాటిస్తున్నారు. 
 
కుటుంబం, కట్టుబాట్లు అనే సమస్యల్లో ఇరుక్కుపోకుండా సంతోషంగా జీవించాలనుకుంటున్నారు. యవ్వనంలో ఉన్నప్పుడు అది ఒక మధురానుభూతిగా ఉంటుంది. కాని వృద్ధాప్యంలో నిజమైన ఆత్మీయులు లేకుండా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. 
 
బాధ్యతారహితంగా కాకుండా శృంగారానికి ప్రేరేపితులైన, అనుభవించి వదిలేసిన, ఒక వారసత్వమే గుర్తింపులేని అనాథలుగా పుడుతున్నారు. శరీర పరమైన ఆశలను దాటి ఒక జీవితముందని మరిచిపోవద్దు. అతి శృంగారం ఆపద, అందుకని శృంగారము లేకుండా జీవించడం కూడా ఆపదే. 
 
బాధ్యత, పట్టుదల, కోరికలు ఇవి లేకుండా అసలు సంతోషమే లేదు. జీవితం పక్కదారి పట్టకుండా మూడింటికే స్థానం ఇవ్వాలి.