నా దట్టమైన కేశాలంటే ఆయనకెంతో ఇష్టం... అలా చేస్తానని ఒట్టు వేయించుకున్నాడు...

beauty
Last Modified బుధవారం, 17 ఏప్రియల్ 2019 (16:47 IST)
మేమిద్దరం ప్రేమికులం. ప్రేమించుకునేటపుడు ఆయనకు నా దట్టమైన కేశాలంటే ఎంతో ఇష్టపడేవారు. మా ప్రేమ పెళ్లికి దారితీసింది. పెళ్లయిన తర్వాత తానే జడ వేయాలని ఒట్టు కూడా వేయించుకున్నాడు. అన్నట్లుగానే పెళ్లయిన దగ్గర్నుంచి నా ఒత్తయిన కేశాలకు కొబ్బరి నూనె పూసి చక్కగా దువ్వి జడ వేస్తూ వచ్చారు. ఇటీవల ఎందుకనో ఒక్కసారిగా మరో కొత్త మాట మాట్లాడుతున్నారు.

నా ఒత్తయిన కేశాలను తొలగిస్తూ నాకు నున్నగా గుండు గీయించాలని అనిపిస్తుందట. నేను ఎన్నిసార్లు వారించినా వినడంలేదు. తిరుపతిలో రూమ్ కూడా బుక్ చేయించాడు. అక్కడికి తీసుకెళ్లి గుండు చేయిస్తాడట. నాకు నా జుట్టంటే ఎంతో ఇష్టం. ఆయనతో కాదని ఎలా చెప్పడం...?

అతడికి తిరుపతిలో ఏదయినా మొక్కు ఉన్నదేమో కనుక్కోండి. జుట్టు అంటే మీకు, ఆయనకు ఇద్దరికీ ఎంతో ఇష్టమని తెలుస్తూనే ఉంది. అలాంటిది తిరుపతిలో గుండు చేయించడమంటే అది తప్పకుండా మొక్కుకు సంబంధించినదే అయి ఉంటుంది. ఇది కానట్లయితే రోజూ మీకు జడ వేస్తానని ఒట్టు వేయించుకున్నాడు కనుక వేస్తున్నాడు. అలా రోజూ జడ వేయలేక జుట్టును గుండు చేయించడం ద్వారా తొలగిస్తే ఆ సమస్య ఇక ఉండదని అనుకుంటున్నట్లుగా ఉంది.దీనిపై మరింత చదవండి :