మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: సోమవారం, 22 అక్టోబరు 2018 (17:49 IST)

అతడు నా భార్యను హగ్ చేస్కుని అక్కడ తాకుతున్నాడు... పిన్ని కొడుకే కదా అంటోంది...

ఇటీవలే పెళ్లయింది. పెళ్లయిన తర్వాత మా ఇంటికి హైదరాబాద్ నుంచి నా భార్య పిన్ని కొడుకు వచ్చాడు. ఆమెతో ఏదో కబుర్లు చెపుతూ నడుముపై చేయి వేసి అలా ఇంటికి దూరంగా తీసుకెళుతూ ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత తిరిగి ఇంట్లోకి వస్తున్నప్పుడు అతడు మరోసారి భార్య నడుముకు కొంచెం పైకి చేయి హగ్ చేసుకుని కుడి వక్షోజాన్ని దాదాపు పట్టుకున్నాడు.
 
కానీ ఇదేమీ నా భార్య పట్టించుకోలేదు. అతడు మాత్రం అక్కడే చేతిని ఉంచి దాదాపు 5 నిమిషాలు ఉంచి స్పర్శించాడు. ఆ తర్వాత నా మూడ్‌ను గమనించి తీసేశాడు. అతడు వెళ్లిన తర్వాత నా భార్యను ఈ విషయంపై ప్రశ్నించాను. ఆమె లబోదిబోమంటూ ఏడ్వడం మొదలెట్టింది. తమ్ముడు తనపై చేయి వేసినా అనుమానిస్తున్నావా అంటూ మొండిగా మాట్లాడుతోంది. నా దృష్టికోణం తప్పా... నేనడిగింది కరెక్టు కాదా...?
 
ఇది చాలా సున్నితమైన విషయం. కొన్ని ఫ్యామిలీల్లో ఇలా చనువు ఉంటుంది. మరికొన్ని ఫ్యామిలీల్లో కట్టుబాట్లు చాలా గట్టిగా ఉంటాయి. సోదరి అయినా ఆమెను తాకరాదన్నట్లుగా ఉంటారు చాలామంది. మరికొందరు ఆమె కూడా తన లాంటిదే అనుకుని ఎక్కడబడితే అక్కడ చేతులు వేసేస్తుంటారు. ఇలాంటివారు తమ ఇంట్లో పెరిగిన వాతావరణాన్ని బట్టి అలా ప్రవర్తిస్తుంటారు. 
 
కొత్తగా పెళ్లయింది కనుక మీ పద్ధతులు, కట్టుబాట్లను ఆకళింపు చేసుకునేందుకు కాస్త టైం పడుతుంది. అదేవిధంగా మీ భార్య తరపు కుటుంబీకుల కట్టుబాట్లు ఎలా ఉన్నాయన్నది మీకు కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్న తర్వాత ఇలాంటి అపార్థాలకు తావుండదు. ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోకండి. మీ భార్యకు మీ కుటుంబ పద్ధతులు ఎలా ఉంటాయో చక్కగా అర్థం చేసుకునేట్లు చెప్పండి. మరోసారి ఆమె సోదరుడు వస్తే ఆటోమెటిగ్‌గా డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తుంది. మీకన్నా ఈ లోకంలో ఆమెకు ఎవరూ ఎక్కువ కాదు...