మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (20:25 IST)

యాంకర్‌ను పెళ్లాడబోతున్నా... శృంగారంలో పాల్గొని వుంటుందేమోననీ...

నా గర్ల్ ఫ్రెండ్ చాలా అందగత్తె. కాలేజీలో ఆమెను బ్యూటీ అని అందరూ అంటుండేవారు. ఏడాది క్రితం ఆమెకు యాంకరింగ్ ఆఫర్ వచ్చింది. పెద్ద యాంకర్ కాలేదు కానీ జూనియర్‌గా ఉంది. ఐతే త్వరలోనే ఆమెను పెళ్లాడబోతున్నా. కానీ ఆమె యాంకరింగ్ చేసేటపుడు కాస్తంత కురచ దుస్తులు వేసుకుని చేస్తోంది. ఇలాంటి దుస్తుల్లో ఆమెను చూడాలంటే ఎబ్బెట్టుగా ఉంటోంది. 
 
నావద్దకు ఇటీవల వచ్చినప్పుడు ఎద భాగాన్ని బయటకు కనబడేట్లు దుస్తులు వేసుకుని వచ్చింది. ఆమెనలా చూసిన తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్లాక ఆమె పూర్తిగా మారిపోయిందేమోననిపిస్తోంది. కానీ వేషభాషలు మారినా ఆమె మెంటాలిటీ ఇదివరికటలానే ఉన్నట్లు అనిపించింది. కానీ ఆమె ఇండస్ట్ర్లీలో ఎవరితోనైనా శృంగార సంబంధం పెట్టుకున్నదేమోనన్న డౌట్ వస్తోంది. పైకి రావాలంటే ఇలా చేస్తుంటారని నా స్నేహితుడొకరు చెప్పాడు. ఆమెను పెళ్లాడవచ్చా లేదా...?
 
మీ స్నేహితుడు చెప్పినది తప్పు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తుంటారు. నచ్చిన వ్యక్తులతో శృంగార సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం వంటివి చాలాచోట్ల జరుగుతుంటాయి. ఇది కేవలం ఇలాంటి ఇండస్ట్రీకే పరిమితమైనది కాదు. కాకపోతే ఇలాంటి పరిశ్రమలో నలుగురితో కలివిడిగా మాట్లాడాలి. లేకపోతే అవకాశాలు రావు. ముడుచుకుని కూర్చుంటే ఎవ్వరూ పట్టించుకోరు.
 
ఇకపోతే ఆమ వస్త్రధారణ అనేది... గ్లామర్ పరిశ్రమలో ఉన్నది కనుక అలా వుండక తప్పదుమరి. ఆమె ఒకమెట్టు పైస్థాయికి వెళ్లినా మిమ్మల్నే పెళ్లాడాలనుకుంటుంది కనుక ఆమె మనస్తత్వం ఏమీ మారలేదు. మీరనుకున్నట్లు ఎవరితోనైనా శృంగార సంబంధం పెట్టుకుంటే ఆమె అతడినే పెళ్లి చేసుకునే టైపని మీరు చెప్పినదాన్నిబట్టి తెలుస్తోంది. మీరు మరీ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఒక్కసారి మనసు ఇచ్చాక ఆమె మనసులో మరో అబ్బాయికి చోటివ్వడం అనేది నూటికి 99.99 శాతం జరగదు. ప్రేమించినవాడు మోసగాడని తెలిస్తే తప్ప. కాబట్టి మీరిలా ఆలోచిస్తున్నారని ఆమెకి తెలిస్తే మీ ముఖం ఇక ఎన్నటికీ చూడదు.