గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రైల్వే బడ్జెట్ 2014 - 15
Written By PNR
Last Updated : మంగళవారం, 8 జులై 2014 (12:43 IST)

రైల్వే ఆదాయం : రూపాయిలో 94 పైసలు ఖర్చులకే!

భారతీయ రైల్వేకు వస్తున్న ఆదాయంలో రూపాయిలో 94 పైసలు రైల్వే ఖర్చు అవుతున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. ఆయన సోమవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగం ముఖ్యాంశాలు ఇవే...
 
దేశంలో హై స్పీడ్ నెట్ వర్క్‌పై దృష్టి సరిస్తామని చెప్పారు. గత కొన్నేళ్లుగా రవాణా రంగంలో రైల్వేల ఆదాయం తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రైల్వేకు వస్తున్న ఆదాయంలో 94 పైసలు ఖర్చులకు పోతోందని వివరించారు. 
 
ఇప్పటిదాకా ప్రాజెక్టులు మంజూరు చేయడమే గానీ తప్ప పూర్తి చేయడంపై దృష్టి సారించలేదు. ఇంకా 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.  పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్ల నిధులు అవసరం ఉందన్నారు. రైల్వేలు సామాజిక బాధ్యతను మరువలేదన్నారు. పదేళ్లలో రూ.3700 కోట్లతో 41,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు వేశామని తెలిపారు. రైల్వేలో విదేశీ పెట్టుబడుల అవసరం చాలా ఉందని, అయితే ఆపరేషన్ విభాగంలో మాత్రం వీటిని దూరంగా ఉంచుతామన్నారు.