గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రైల్వే బడ్జెట్ 2014 - 15
Written By PNR
Last Updated : మంగళవారం, 8 జులై 2014 (12:55 IST)

మళ్లీ రైలు చార్జీల మోత తప్పదు : సదానంద గౌడ

కేంద్ర రైల్వేమంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్‌ను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ముందు ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. అయితే నరేంద్ర మోడీ చెప్పినట్లు హిందీలో కాదులెండి, ఇంగ్లీషులో. రైల్వేమంత్రిగా తాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రజల అంచనాలను అందుకుంటుందని భావిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఆయన రైల్వే బడ్జెట్‌లోని కీలకాంశాలు.. 
 
2014-15 ఖర్చు రూ.1,49,000 కోట్లుగానూ, 2014-15లో ఆదాయం రూ.1,64,000 కోట్లుగా అంచనా వేసినట్టు చెప్పారు. ఛార్జీల పెంపుతో రూ.8 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం రైల్వే స్టేషన్లలో బ్యాటరీ వాహనాలు సమకూర్చుతామన్నారు. 
 
స్టేషన్లలో శుభ్రతను పరిశీలించేందుకు సీసీటీవీలు, ప్రధాన రైళ్లలో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సీటు, బెర్త్ మాత్రమే కాకుండా... కోచ్, రైలును కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. డబ్లింగ్, ట్రిప్లింగ్‌లకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, కొత్త రైల్వే లైన్లకు రెండో ప్రాధాన్యత ఇస్తామని, ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.