మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (13:54 IST)

ఈ 3 లక్షణాలున్న భార్యతో వేగడం చాలా కష్టం అని చెప్పిన చాణక్యుడు

Chanakya Niti
ఆచార్య చాణక్యుడి గురించి దాదాపు తెలియని వారు వుండరు. చాణక్య నీతి సూత్రాలు జనబాహుళ్యంలో విపరీతంగా ప్రచారంలో వున్నాయి. చాణక్యుడు భార్యలో ఎలాంటి లక్షణాలు వుండకూడదో... ముఖ్యంగా 3 లక్షణాలు వున్న భార్య కనుక వుంటే ఇక ఆ భర్త జీవితంలో ఎదగడం మాట అటుంచి ఇంట్లో ప్రశాంత జీవితం కూడా వుండదని చెప్పాడు. 
 
మొదటిది ఏంటంటే... భర్త మాట్లాడగానే దానికి మరో విపరీత అర్థం తీస్తూ నిత్యం గొడవపడే భార్యతో వేగడం చాలా కష్టం. కోపంతో రగిలిపోయే భార్యతో ఇంటి ప్రశాంత వాతావరణానికి భంగం వాటిల్లుతుంది. కనుక అలాంటి భార్యను విడిచిపెట్టడం సరైందని చాణక్యుడు ప్రస్తావించాడు.
 
ఇంట్లో ఎప్పుడు అశాంతిని కలిగించే పనులు చేసే భార్యతో భర్తకు సంతోషం వుండదనీ, అందువల్ల అటువంటి భార్యను విడిచిపెట్టడం మంచిదనీ, లేదంటే కుటుంబం దెబ్బ తింటుందని చాణక్యుడు తెలిపాడు. భర్తకు శాంతిని కలిగించే పనులను ఆచరించే భార్యతో కుటుంబం సుఖసంతోషాలతో వర్థిల్లుతుందని చాణక్యుడు పేర్కొన్నాడు.
 
నాలుకపై నియంత్రణ లేకుండా, కనీస ఆలోచన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే భార్యతో భర్తకు గొడవలు జరుగుతాయి. ఇలాంటి వాదన ఇంటిని దెబ్బతీస్తుందని చాణక్యుడు తెలిపాడు. 
 
చాణక్య నీతి సూత్రాలు విపరీతమైన ప్రచారాన్ని కలిగి వున్నాయి. వాటి నుంచి తీసి అందించిన సూత్రాలే ఇవి. కేవలం చాణక్యుడు చెప్పిన సమాచారం మాత్రమే ఇక్కడ అందించాము.