బుధవారం, 13 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 16 మే 2022 (17:49 IST)

బుధవారం నాడు తలస్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా?

head bath
నేటి కాలంలో ఎప్పుడుపడితే అప్పుడు తలస్నానం చేయడం అలవాటైపోయింది. కానీ అలా తలస్నానం చేస్తే పలు అనారోగ్య సమస్యలు వస్తాయన్నది ప్రాచీన శాస్త్రాల్లో చెప్పబడింది. పాడ్యమినాడు రిక్తతిథుల్లో పున్నమి, అమావాస్య, చతుర్దశి, అష్టమి, షష్ఠి, ఏకాదశి ద్వాదశి, సప్తమి, త్రయోదశి, తదియ, నవమి తిథుల్లో సంక్రాంతినాళ్ళల్లో వ్యతిపాతాల్లో పితృకర్మలు చేయు రోజుల్లో ఉపవాసం చేసేరోజుల్లో ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తైల మర్దనాన్ని శాస్త్రాలు నిషేధించినాయి. అంటే ఈ రోజుల్లో తలంటు పోసుకోరాదు. దానివల్ల సంపదలు తొలగిపోతాయి. ఆయుస్సు క్షీణించి పోతుంది.

 
అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, గ్రహణాలు ఇవన్నీ సంధికాలాలు సూర్యునికి భూమికిగల సంబంధంలో విషమత్వమేర్పడుతుంది. ఈ రోజుల్లో అభ్యంగనస్నానం చేయకూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

 
ఆదివారం: ఈ రోజున తలస్నానం చేస్తే అందం తగ్గుతుంది. కలత, సంతాపం కలుగుతుంది. కానీ అవసరమైతే నూనెలో పువ్వులు వేసి తలంటుకుని తలస్నానం చేయవచ్చు. 

 
సోమవారం: ఈ రోజున తలస్నానం చేయడం అంత మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఒకవేళ చేస్తే కాంతి హీనత, భయం ఉంటుందట.

 
మంగళవారం: ఈ రోజు తలస్నానం చేస్తే విరోధం, అపాయం, ఆయుఃక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది.

 
బుధవారం: ఈ రోజు తలస్నానం చేస్తే అన్నివిధాలా శుభం.

 
గురువారం: అశాంతి, విద్యా లోపం, ధన వ్యయం, కీడు, శత్రు వృద్ధి. అవసరమైతే నూనెలో గరిక వేసి తలంటు స్నానం చేయాలి. 

 
శుక్రవారం: ఈ రోజున తలస్నానం చేస్తే అశాంతి, వస్తునాశం, రోగప్రదం. కానీ కొందరు సౌఖ్యప్రదమని అంటారు.

 
శనివారం: ఈ రోజున తలస్నానం చేయడం వలన ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ, కుటుంబ సౌఖ్యం, భోగం, శుభం కలుగుతుంది.