గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (17:58 IST)

ఆషాఢంలో గుప్త నవరాత్రులు.. కలశ స్థాపన ఎలా?

Durga
ఆషాఢ మాసంలో జరుపుకునే నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు.ఆషాఢ గుప్త నవరాత్రి 2024 జూలై 06వ తేదీ శనివారం ప్రారంభమై జూలై 15వ తేదీ సోమవారం ముగుస్తాయి. ఈ గుప్త నవరాత్రులలో దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు.
 
గుప్త నవరాత్రులలో ఆచారాలు, మంత్ర తంత్రాలతో దుర్గాదేవిని పూజించడం ద్వారా అన్ని రకాల వ్యాధులు, దుఃఖాలు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం. గుప్త నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపన చేస్తారు. ఈ కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సకల దేవతలు ఈ కలశంలో కొలువై ఉంటారని విశ్వాసం. 
 
కలశాన్ని స్థాపించిన స్థలంలో మొత్తం 9 రోజులు పూజ చేయాలి, ఈ తొమ్మిది రోజులు పూర్తి కాకుండా పాటు పొరపాటున కూడా దాని స్థానం నుండి తొలగించకూడదు. కలశ సంస్థాపన సమయంలో మురికి నీరు, నల్ల మట్టిని ఉపయోగించవద్దు.
 
ఆషాఢ గుప్త నవరాత్రులు దుర్గా అని కూడా పిలువబడే శక్తి దేవి యొక్క తొమ్మిది అవతారాలను ఆరాధించడానికి అంకితం చేయబడిన తొమ్మిది రోజుల పండుగ. భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా జరుపుకుంటారు. దీనిని శాకంభరి నవరాత్రి లేదా గాయత్రీ నవరాత్రి అని కూడా అంటారు.