శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (12:25 IST)

అన్నదానం ఎందుకు చేయాలి? పరమేశ్వరునికి పెట్టే నైవేద్యం ఏమౌతుంది?

లోకంలో ఏ వస్తువును దానం చేయొచ్చు. కానీ అన్నం శ్రేష్టమైనది. 84లక్షల జీవరాశుల్లో.. ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేక ఆహార విధానం పరమేశ్వరుని ద్వారా నిర్ణయించబడి వుంటుంది. అందుకే ఆయనకు పూజ చేసేటప్పుడు ఉపవాసం చ

లోకంలో ఏ వస్తువును దానం చేయొచ్చు. కానీ అన్నం శ్రేష్టమైనది. 84లక్షల జీవరాశుల్లో.. ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేక ఆహార విధానం పరమేశ్వరుని ద్వారా నిర్ణయించబడి వుంటుంది. అందుకే ఆయనకు పూజ చేసేటప్పుడు ఉపవాసం చేపట్టాలంటారు. అలా ఉపవాసం చేసి.. పరమేశ్వరునికి నైవేద్యం చేయడం ద్వారా.. ఉపవసించిన వ్యక్తి పరమేశ్వరునికి నైవేద్యం పెట్టిన ఆహారం సకల జీవులకు చేరుతుందని విశ్వాసం 
 
ఓ వ్యక్తి ఉపవాసం ఉండి పరమేశ్వరుని పెట్టే నైవేద్యాన్ని... పరమేశ్వరుడు తాను మాత్రమే స్వీకరించకుండా తాను సృష్టించిన 84లక్షల జీవరాశులకు పంచిపెడతాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక శుభకార్యాలు చేసేటప్పుడు అన్నదానాన్ని చేయాలి. అన్నం లేకుండా ఏ జీవరాశి బతకలేదు. అందుకే ఆకలి బాధతో ఉన్నవారికి అన్నదానం చేయడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయి.
 
అన్నదానానికి మించిది లేదని పెద్దలు అంటారు. ధనం, బంగారం దానం చేస్తే దానంగా పొందే వ్యక్తి మరింత అధికంగా ఆశిస్తాడు. అదే అన్నాన్ని దానం చేస్తే కడుపు నిండిన తర్వాత అధికం ఆశించడు. అన్నదానాన్ని చేస్తే భవిష్యత్తులో రాబోయే కార్యక్రమాలను శుభఫలితాలను ఇస్తుంది. అన్నదానం చేయడం ద్వారా దంపతుల అన్యోన్యత పెరుగుతుంది అభిప్రాయభేదాలు తొలగిపోతాయి. 
 
అందుకే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాల్లో అన్నం పెడతారు. అలా శుభకార్యాల్లో అన్నాన్ని దానంగా పెట్టడం ద్వారా దంపతులకు మేలు జరుగుతుంది. కడుపారా భుజించిన వారి నోట వచ్చే శుభమైన మాటలు కొత్త వధూవరులకు ఆశీర్వాదంగా మారుతాయని పండితులు చెప్తున్నారు.