కాలాష్టమి రోజున ఆవనూనెతో దీపాన్ని వెలిగిస్తే..?
కాలాష్టమిని సెప్టెంబర్ 24, 25 తేదీల్లో జరుపుకుంటారు.
కాలాష్టమి తిథి ప్రారంభం: సెప్టెంబర్ 24.. మధ్యాహ్నాం 12:38 గంటల నుంచి ప్రారంభం
అష్టమి తిథి ముగుస్తుంది: సెప్టెంబరు 25 మధ్యాహ్నాం 12:10 గంటలకు
కాల భైరవునిని భక్తులకు కాలాష్టమి రోజున నిష్ఠతో పూజిస్తారు. శివుని అవతారం అయిన కాల భైరవుడు భక్తులను ప్రతికూల శక్తులు, చేతబడి నుండి రక్షిస్తాడని నమ్ముతారు. భైరవుడిని ఆరాధించడం ద్వారా, దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది. ఇంకా కాలభైరవ పూజతో శ్రేయస్సు చేకూరుతుంది.
కాలభైరవునికి కాలాష్టమి రోజున సాయంత్రం పూట ఆవాల నూనెను ఉపయోగించాలి. హల్వా, పాలు వంటివి ప్రసాదంగా అందజేయాలి. కొంతమంది భక్తులు భైరవుడికి ప్రత్యేకమైన నైవేద్యంగా మద్యాన్ని కూడా సమర్పిస్తారు.
కాలభైరవుని పూజతో భక్తులకు భౌతిక ఆధ్యాత్మిక విజయాన్ని ప్రసాదిస్తాడు. అడ్డంకులు తొలగిపోతాయి. మరణ భయాన్ని జయించే శక్తినిస్తాడు. కాలభైరవుడిని పూజించడం వల్ల మరణానికి సంబంధించిన భయాలు దూరమవుతాయి.