బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (19:31 IST)

డిసెంబరు 04: కార్తీకమాసం మూడో సోమవారం.. ఇలా చేస్తే?

Lord Shiva
డిసెంబరు 04 కార్తీకమాసం మూడో సోమవారం శివకేశవుల పూజతో సర్వశుభాలు చేకూరుతాయి. సోమవారాలలో నిమయ నిష్టలతో పూజ చేస్తే అనంత కోటి పుణ్యఫలితాలు దక్కుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఒక్క సోమవారం అయినా నియమ నిష్టలతో ఉపవాసం చేసిన దేవాలయంలో దీపం వెలిగించి ఆకాశ దీపాన్ని చూస్తే కోటి పుణ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. కార్తీక మాసంలో వ్రతాలు, జపాలు, దానాలు ఆచరించిన వారికి 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. 
 
ముందుగా ఇంటిని శుభ్రం చేసి, తులసి కోట చుట్టుపక్కల ప్రాంతాలను కూడా శుభ్రం చేసుకోవాలి.  దీపాలు వెలిగించడానికి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వాడటం మంచిది. దీపాన్ని దేవుని వైపు ఉంచండి. దేవునికి ప్రసాదం సమర్పించాలి. 
 
ఉపవాసం వున్నవారు.. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
 ఉపవాసం ఉన్నవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. 
ద్రవపదార్థాలు కూడా తీసుకోవచ్చు.