ఈ త్రిగుణములు దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండియే కలుగుచున్నను...
జగము నందలి సమస్త కర్మలు ప్రకృతిజన్య త్రిగుణముల చేతనే నిర్వహించబడుచున్నవి. ఈ త్రిగుణములు దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండియే కలుగుచున్నను అతడెన్నడును వాటిచే ప్రభావితుడు కాడు. ఉదాహరణకు రాజ్యాంగ నియములచే ఎవరైనను శిక్షింపబడవచ్చునేమోగానీ, ఆ రాజ్యాంగమును తయారుచేసిన రాజు మాత్రము రాజ్యాంగ నియములకు అతీతుడై యుండును.
అదేవిధంగా సత్త్వరజస్తమోగుణములు శ్రీకృష్ణభగవానుని నుండియే ఉద్భవించినను అతడెన్నడును ప్రకృతిచే ప్రభావితుడు కాడు. కనుకనే అతడు నిర్గుణుడు. అనగా గుణములు అతడి నుండియే కలుగుచున్నను అతనిపై ప్రభావమును చూపలేవు. అదియే భగవానుని లేదా దేవదేవుని ప్రత్యేక లక్షణములలో ఒకటి.