1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 3 ఏప్రియల్ 2017 (21:41 IST)

ఆ 7 వదిలితే సుఖం... ఒక్కడే మేల్కోవడం చేటు...

మహాభారతంలో విదురుడు చెప్పిన నీతి గురించి కొంచెం... బుద్ధి ఒక్కటే. దాంతో చెయ్యతగ్గదీ, చెయ్యరానిదీ ఏమిటనేవి రెండూ నిశ్చయించుకోవాలి. సామమూ, దానమూ, భేదమూ, దండమూ ఈ నాలుగు ఉపాయాలతో మిత్రుడినీ, తటస్థంగా వున్నవాడినీ, గర్భశత్రువునీ... ఈ ముగ్గురినీ వశపరచుకోవాల

మహాభారతంలో విదురుడు చెప్పిన నీతి గురించి కొంచెం... బుద్ధి ఒక్కటే. దాంతో చెయ్యతగ్గదీ, చెయ్యరానిదీ ఏమిటనేవి రెండూ నిశ్చయించుకోవాలి. సామమూ, దానమూ, భేదమూ, దండమూ ఈ నాలుగు ఉపాయాలతో మిత్రుడినీ, తటస్థంగా వున్నవాడినీ, గర్భశత్రువునీ... ఈ ముగ్గురినీ వశపరచుకోవాలి. ఇంద్రియాలయిదూ నిగ్రహించుకుని సంధీ, విగ్రహమూ, యానమూ, ఆసననమూ, ద్వైధీభావమూ, సమాశ్రయమూ... ఈ ఆరు గుణాలు బాగా అలవరుచుకుని స్త్రీల యెడల వ్యామోహమూ, జూదమూ, వేటా, సురాపానము, పుల్లవిరిచినట్లు మాట్లాడటమూ, క్రూరంగా దండించడమూ, దుబారా ఖర్చులు చేసి డబ్బు నాశనం చేసుకోవడమనే ఈ ఏడూ వదులుకుంటే సుఖం కలుగుతుంది.
 
పుచ్చుకున్న వాడిని ఒక్కడినే చంపుతుంది విషం. కత్తి దెబ్బ కూడా ఒక్కడినే కడతేరుస్తుంది. ఉన్న మంచిపదార్థాలన్నీ ఒక్కడే ఆరగించకూడదు. ఒక్కడే కూర్చుని ఏ ఆలోచనా చేయకూడదు. దూరదేశాలు వెళ్లవలసి వస్తే ఒక్కడే వెళ్లకూడదు. ఇంటిల్లపాదీ గాఢంగా నిద్రపోయేటప్పుడు ఒక్కడే మేలుకుని వుండకూడదు. సత్యం ఒక్కటే తెలుసుకోదగ్గది. పలకవలసిందీ సత్యం ఒక్కటే. ఆ సత్యం స్వర్గానికి మెట్టు. సముద్రంలో ప్రయాణం చేసే వాడికి ఓడ యెటువంటిదో లోకంలో బతికేవాడికి సత్యం అటువంటిది.