గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 17 జూన్ 2021 (23:42 IST)

పళ్లెంలో భోజనం మన కోసం ఎదురుచూడకూడదు, ఎందుకంటే?

మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు, మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి.
 
 ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. ఎందుకనగా దీర్ఘాయుష్షు వస్తుంది.
 
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది. ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది.
 
అన్నము తింటున్నప్పుడు అన్నమును, ఆ అన్నము పెట్టువారిని తిట్టుట, దుర్భాషలాడుట చేయరాదు. ఏడుస్తూ తింటూ, గిన్నె/ ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు. దెప్పి పొడువరాదు. ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు. ఇది చాలా దరిద్రము. భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం.