శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 23 జనవరి 2018 (19:13 IST)

జనవరి 24న తిరుమలలో రథసప్తమి... సేవలన్నీ రద్దు... ఏడు వాహనాలపై శ్రీవారు

తిరుమల రథసప్తమికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, దాతలకు, మిలటరీ, యన్‌.ఆర్‌.ఐలకు సుపథం మార్గంలో కల్పించబడే ప్రత్యేక దర్శనాలను కూడా టి

తిరుమల రథసప్తమికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, దాతలకు, మిలటరీ, యన్‌.ఆర్‌.ఐలకు సుపథం మార్గంలో కల్పించబడే ప్రత్యేక దర్శనాలను కూడా టిటిడి రద్దు చేసింది.
 
రథ సప్తమి సంధర్భంగా స్వామివారు సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్సనమివ్వనున్నారు. 24వ తేదీ ఉదయం స్వామి వారు వాహనం ఉ. 5.30 - ఉ. 08.00 సూర్యప్రభ వాహనం. (సూర్యోదయం ముహూర్తం ఉ. 6.45 గంటలుగా నిర్దేశించడమైనది). ఉ. 9.00 - ఉ. 10.00 చిన్నశేష వాహనం. ఉ. 11.00 - మ. 12.00 గరుడ వాహనం, 1.00 - మ. 2.00 హనుమంత వాహనం, మధ్యాహ్నం. 2.00 - మ. 3.00 చక్రస్నానం, సాయంత్రం 4.00 - సా. 5.00 కల్పవృక్ష వాహనం, సా. 6.00 - సా. 7.00 సర్వభూపాల వాహనం, రా. 8.00 - రా. 9.00 చంద్రప్రభ వాహన సేవలు కొనసాగనున్నాయి. 
 
శ్రీవారి ఆలయంలో ఆరోజు నిర్వహించే ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చన ఏకాంతంగా కొనసాగించనున్నారు.