శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 16 జులై 2018 (16:21 IST)

సరస్వతి దేవికి ఇష్టమైన నైవేద్యాలు... విద్యార్థులు ఆచరించాల్సినవి

విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. విద్యార్థిని, విద్యార్థులు ఆ తల్లి దర్శనం చేసుకుని తాము చదువుల్లో రాణించేలా చేయమని కోరుతుంటారు. అభివృద్ధి పథంలో తమని నడిపించమని ప్

విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. విద్యార్థిని, విద్యార్థులు ఆ తల్లి దర్శనం చేసుకుని తాము చదువుల్లో రాణించేలా చేయమని కోరుతుంటారు. అభివృద్ధి పథంలో తమని నడిపించమని ప్రార్ధిస్తుంటారు. సరస్వతి దేవి అమ్మవారి దర్శనం చేసుకోగానే మనస్సు ప్రశాంతతను పొందుతుంది.
 
ఆ తల్లి తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అలకరించబడి వీణను ధరించి ఉంటుంది. తెలుపు స్వచ్ఛతకు, పవిత్రతకు చిహ్నంగా కనిపిస్తుంది. అలాంటి శ్వేతవర్ణంలో అమ్మవారిని దర్శించడం వలన వెంటనే మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. విద్యకు అధిదేవత అయిన అమ్మవారి ప్రీతిని పొందాలంటే ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది.
 
సరస్వతీ దేవికి పాలు, పెరుగు, వెన్న, తేనె, పాయాసం అంటే ఎంతో ఇష్టం. అందువలన ఆ తల్లికి నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.