శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 3 జూన్ 2017 (18:39 IST)

దేవునికి తైల లేపనం చేసిన నూనెను ఏం చేయాలి?

దేవునికి... ముఖ్యంగా శనీశ్వరునికి తైలాభిషేకం చేయించి, ప్రసాద రూపంగా తైలాన్ని ఇస్తారు. స్వామికి తైల లేపనంతో అన్ని దుఃఖాలు, అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇటువంటి ప్రసాదాలకు తైల ప్రసాదాలని పేరు. ఈ ప్రసాదాలతో అన్ని కష్టాలు దుఃఖాలు తొలగి పోయి స్వామి అనుగ్రహం

దేవునికి... ముఖ్యంగా శనీశ్వరునికి తైలాభిషేకం చేయించి, ప్రసాద రూపంగా తైలాన్ని ఇస్తారు. స్వామికి తైల లేపనంతో అన్ని దుఃఖాలు, అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇటువంటి ప్రసాదాలకు తైల ప్రసాదాలని పేరు. ఈ ప్రసాదాలతో అన్ని కష్టాలు దుఃఖాలు తొలగి పోయి స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఈ తైల లేపాలను భక్తులకు ఇస్తారు. వీటిని ఏం చేయాలో తెలుసా?
 
1. ఎవరికైతే మోకాళ్ల నొప్పి ఉంటుందో అటువంటి వారు తైల ప్రసాదాన్ని పూసుకుంటే మోకాళ్ల నొప్పులు త్వరగా నయం అవుతాయి.
 
2. నడుము నొప్పి, వెన్ను నొప్పి ఉన్నవారు ఈ తైలాన్ని పూసుకుంటే నొప్పులు త్వరగా తగ్గిపోతాయి.
 
3. ఎవరికైతే ఎముకలు నొప్పిగా ఉంటాయో, నొప్పించే ప్రాంతంలో స్వామి తైలాన్ని రాసుకుంటే సమస్యలు తొలగిపోతాయి.
 
4. చర్మ వ్యాధులపై రాసుకుంటే అవి తగ్గిపోతాయి.
 
5. ఎవరికైతే ఏడున్నర సంవత్సరాల పాటు ఏలినాటి శని పట్టుకుని పీడిస్తుందో వారు స్వామి అభిషేకపు తైలాన్ని పూసుకుని స్నానం చేస్తే స్వామి అనుగ్రహం లభిస్తుంది.
 
6. స్వామికి పూసిన తైలాన్ని వంటకు ఉపయోగించకూడదు. జాగ్రత్త.
 
7. వ్రణాలతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎటువంటి లేపనాలతో నయం కాకపోతే స్వామి లేపనం చేసిన తైలం పూసుకుంటే తప్పకుండా వ్రణాలు తొలగిపోతాయని విశ్వాసం.
 
8. ఎవరైతే పంటి నొప్పితో సతమతమౌతుంటారో, పిప్పి పళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారో అటువంటివారు స్వామి తైలాన్ని ఒక చెంచా తీసుకుని ఆయిల్ పుల్లింగ్ చేస్తే పళ్ల సమస్యలు తొలగుతాయి.
 
9. బెణుకులు ఉన్నవారు స్వామి తైలాన్ని రాసుకుంటే త్వరగా ఫలితం కనిపిస్తుంది.
 
10. ఎవరికైతే పైకి కనిపించని దెబ్బలు తగిలి నొప్పులు ఉంటాయో అటువంటి వారు స్వామి తైలాన్ని రాసుకుంటే త్వరగా ఫలితం కనిపిస్తుంది.
 
11. స్వామికి తైలాభిషేకాన్ని సంవత్సరానికి లేదా ఆరు నెలలకు ఒక సారి చేయిస్తే ఎప్పుడూ సుఖశాంతులు, ప్రశాంతత, సంతోషాలు కలుగుతాయి.
 
12. స్వామి దేవాలయానికి దీపానికి నూనె లేదా నేతిని ఇస్తే చాలా త్వరగా శ్రేయస్సును, ఉన్నత స్థితిని పొందుతారు. ఉదర సంబంధ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.