నన్ను నమ్మిన వారిని ఎన్నడు పతనం కానివ్వను... సాయిబాబా సూక్తులు.
1. నాపై నీ దృష్టి నిలుపు. నీ పైన నా దృష్టి నిలుపుతాను.
2. గురువును సంపూర్ణంగా.. అంటే అన్నింటీకీ, అన్ని కాలాల్లోను, పరిస్థితుల్లోను నమ్ముకో, అదే అసలైన సాధన.
3. గురువే అన్ని దైవాలున్నూ, సాధన చతుష్టయం, శాస్త్రషట్కం అక్కర్లేదు. గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్నపానీయాలు.
4. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను. నేను నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను.
5. నన్ను నమ్మిన వారిని ఎన్నడు పతనం కానివ్వను.
6. నా సమాధి నన్నాశ్రయించిన వారితో మాట్లాడుతుంది. వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానం చెబుతుంది.
7. పని చేయి, దేవుని నామం ఉచ్చరించు, సత్గ్రంథాలు చదువు. పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు.
8. నువ్వేం చేసినా సంపూర్ణంగా, క్షుణ్ణంగా చెయ్యి లేదా చెయ్యటానికి ఒప్పుకోకు.
9. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. ఒకటిరెండు రకాల పదార్థాలతో తృప్తి చెందు.
10. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు.