Widgets Magazine

నీవీ దేహాన్ని మూడురోజులు కాపాడుకో... షిర్డీ సాయి

బుధవారం, 25 జులై 2018 (21:18 IST)

సాయినాధుని శిరిడిలో మొట్ట మొదటిసారి చూడగానే ఒక గొప్ప మహాత్ముడని, బాబాలో దాగియున్న దివ్యత్వాన్ని గుర్తించి బాబా రెండవసారి శిరిడీ చేరినపుడు ఆయనను... యా సాయి - రండి సాయి అని ఆహ్వానించి ఆ సాటిలేని సద్గురుమూర్తికి ఆ దివ్య నామమిచ్చి మానవ కళ్యాణానికి మాయని మార్గం వేసిన సాయినాధునికి అత్యంత ప్రీతికరమైన భక్తుడు మహల్సాపతి. సాయిబాబాకు సన్నిహిత సేవకులలో మొదటివాడు మహల్సాపతి. సదాచార సంపన్నుడైన మహల్సాపతి స్వర్ణకారుడు. ఇతడు వంశపారంపర్యంగా వస్తున్న మహల్సాపతి స్వామి పూజయే ఇంట్లోనూ, శిరిడీ గ్రామంలోని ఖండోబా మందిరంలోనూ శ్రద్దగా చేస్తుండేవాడు. 
 
మహల్సాపతి జీవనం కోసం వంశవృత్తి చేసేవాడు. అంత కష్ట జీవితంలోనూ వీలైనంత సమయం సాధు సాంగత్యంలో గడిపేవాడు. ఎన్నో జన్మల పుణ్యం వలన అతడికీ జన్మలో శ్రీ సాయిబాబా సేవ సుమారు 5 దశాబ్దాలకు పైగా లభించింది. ఇతనికి బాబా పట్ల గల భక్తి విశేషమైనది. ఇతరులు సాయి లీలలు చూశాకనే ఆయనను భక్తితో ఆశ్రయించగలిగారు. కానీ ఇతను మాత్రం సాయిని దర్శించిన క్షణం నుండే వారి దైవత్వాన్ని గుర్తించి బాబా  సేవకు అంకితమయ్యాడు. లా విశ్వసించగలవారే నిజమైన భక్తులు. అందులో కూడా శిరిడీలో సాయి ప్రకటమైన కొత్తల్లో బాబా ప్రవర్తన వింతగా ఉండేది. ఆయనను చూసి అందరూ పిచ్చివాడనుకునేవారు. కారణం ఆయన అప్పుడప్పుడు నిష్కారణంగా కోపించడం, తమలో తాము గొణుక్కుంటూ చిత్రమైన భంగిమలు చేస్తుండడం, ఎదుట ఎవరూ లేకున్నా తిడుతూండటం వలన అందరూ అలా అనుకుంటుండేవారు.
 
కానీ... ఈ పిచ్చి వాలకం మాటున సాయిలో దాగి ఉన్న దివ్యత్వాన్ని గుర్తించినది మహల్సాపతి ఒక్కడే. బాబాలోని పూర్ణ వైరాగ్యం వంటి శుద్ద సాత్వికమైన లక్షణాలు మహల్సాపతిని ఆకట్టుకున్నాయి. మొదటినారి ఇతడే ఒకరోజున మశీదుకు వెళ్లి బాబా పాదాలపై పువ్వులు వేసి వారి పాదాలకు, మెడకు చందనం అద్ది నైవేద్యంగా పాలు సమర్పించాడు. రాత్రి సమయాల్లో కూడా మహల్సాపతి సాయిబాబా చెంతనే ఒక రాత్రి మశీదులోనూ, ఒక రాత్రి చావడిలోనూ నిద్రపోయేవాడు. ప్రతి రాత్రి బాబా వద్దకు చేరి తన వద్దనున్న గుడ్డ నేలపై పరిచేవారు. దాని మీదనే ఒక ప్రక్కన సాయి, మరొక ప్రక్కన అతడు పడుకునేవారు. ఇలా మపల్సాపతికి ఎన్నో సంవత్సరాలు ఆ సన్నిధిలో తపస్సు కొనసాగింది. ఇతనికి బాబాతో గల సన్నిహితం ఒక్క విషయంలో తెలుస్తుంది. 
 
1886లో ఒకరోజు బాబా అతనితో అరే భగత్ నేను అల్లా వద్దకు పోతున్నాను. నీవీ దేహాన్ని మూడురోజులు కాపాడుకో.... నేనటు తరువాత తిరిగి రాకుంటే దీనిని ఆ వేపచెట్టు దగ్గర సమాధి చెయ్యి అని చెప్పి, అతడి తొడపై తలపై ఉంచి శరీరం విడిచిపెట్టారు. ఆ మూడురోజులు అతడు నిద్రహారాలు మాని అలానే కూర్చున్నాడు. ఆ దేహాన్ని సాధ్యమైనంత త్వరగా సమాధి చేయాలని ఎందరెంతగా చెప్పిన మహల్సాపతి తన పట్టు విడవక మూడు రోజుుల దానిని కాపాడుతూ వచ్చాడు. ఆటు తరువాత బాబా తిరిగి శరీరం ధరించి 32 సంవత్సరాలు తమ అవతార్యకార్యం కొనసాగించారు. అంతటి భాద్యతతో కూడిన పని సాయి అతనికే అప్పగించారు. 
 
ఇంతగా తనని అంటిపెట్టుకుని నిరంతరం సేవ చేస్తున్న మహల్సాపతి పట్ల బాబాకు ప్రత్యేకమైన ప్రీతి ఉండేది. బాబా యింకెవరు చెప్పినా విన్పించుకోలేని సందర్బాలలో గూడా మహల్సాపతి బాబాకు నచ్చజెప్పి ఏ శుభకార్యానికైనా ఒప్పించగలిగేవాడు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

అయ్యప్ప దీక్షకు చేయవలసిన నియమాలివే...

అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులే నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, ...

news

భక్తి మార్గాలతో షిరిడిసాయి అనుగ్రహం...

భక్తిలో తొమ్మది మార్గాలుంటాయి. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన చేయడం, ...

news

సిఫార్సులు బంద్.. అందరికీ సర్వదర్శనమే... తితిదే బోర్డు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు ...

news

హనుమంతుడి అనుగ్రహం... భక్తులు కోరికలు నెరవేర్చుటలో...

హనుమంతుడు సున్నితమైన మనస్సు గలవాడు. తన స్వామి శ్రీరామచంద్రుడిని ఎంతగా ఆరాధిస్తాడో, తన ...

Widgets Magazine