అభిషేకం, హారతి, తీర్థం విశిష్టత
దేవతా విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి. కనుక ఆ విగ్రహాలకు పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అలాగే పచ్చ కర్పూరం వెలిగించి హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు.
తీర్థంలో పచ్చ కర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు. పైవాటిలో ఆధ్యాత్మిక విశిష్టతతో పాటు ఔషధ గుణాలు కూడా వున్నాయి.