శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 20 అక్టోబరు 2022 (19:59 IST)

దీపం ఎందుకు పెట్టాలి? దీపదానం ఎందుకు చేయాలి?

Deepam
దీపదానం చేయడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు తెలుసుకుందాము. అకాల మరణాన్ని అరికట్టాలంటే దీపదానం చేయాలి. కాలం చేసిన పూర్వీకుల మోక్షం కోసం దీపాలను దానం చేయండి. లక్ష్మీ దేవిని, విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి దీపాలను సమర్పించాలి.
 
యమ, శని, రాహు, కేతువుల దుష్ఫలితాలను దూరం చేయడానికి దీపాలను సమర్పించాలి. గృహ వివాదాలు, ఇబ్బందులను నివారించడానికి దీప దానం చేయాలి. జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది అందుకే దీపాలు ఇస్తున్నాం. మోక్షం కోసం దీపాలను దానం చేయాలని విశ్వాసం.
 
చేస్తున్న పని విజయవంతం కావడానికి దీపదానం చేయాలి. సంపద, శ్రేయస్సు కొనసాగాలంటే దీప దానం చేయాలి. దీపం వెలిగించడం ద్వారా అన్ని యజ్ఞాలు, తీర్థయాత్రలు, దానాలు చేసినంత ఫలితం వస్తుంది.