తిరువణ్ణామలై ఆలయ గోపురాలు.. శ్రీ కృష్ణదేవరాయల నుంచి?
తిరువణ్ణామలై 1100 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ ఆలయంలో వెలసిన మహాశివుని పేరు అన్నామలై. అమ్మవారి పేరు ఉన్నామలై. ఈ ఆలయ వాస్తుశిల్పానికి చోళులు, పాండ్య రాజులు, సాంబువరాయర్లు, పోసాల, విజయనగర రాజుల నుండి వివిధ రాజ్యాల సహకారం ఉంది. 1000 స్తంభాల మహాల్, ఎత్తైన గోపురాలు ఆలయ ప్రత్యేకతలు.
ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంతో నిర్మితమైంది. 217 అడుగుల ఎత్తుతో కృష్ణదేవరాయల వారు నిర్మించిన తూర్పు గోపురం తమిళనాడులో రెండవ ఎత్తైన గోపురం. ఇది తంజావూరు పెద్ద గుడి గోపురం కంటే పెద్దది కావడం విశేషం.
ఇది కాకుండా, ఆలయంలో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన వల్లాల మహారాజ గోపురం, కిళి గోపురం, అమ్మని అమ్మన్ గోపురం ఉన్నాయి. కిళి గోపురాన్ని అమ్మని అమ్మన్ అనే సాధారణ భక్తురాలు డబ్బు సేకరించి ఈ గోపురాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెప్తోంది. మహారాజుల నుంచి సాధారణ ప్రజల వరకు నగదును సమీకరించి అరుణా చల శివుని ఆలయ గోపురాలు నిర్మితమైనట్లు చరిత్ర చెప్తోంది.