1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2014 (14:11 IST)

ఉదయాన్నే నిద్రలేవని ఇళ్ళల్లో లక్ష్మీదేవి ఉండదట!

ఉదయాన్నే నిద్రలేవడం అనేది ప్రస్తుతం కనుమరుగైంది. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వలన, ఉదయాన్నే మేల్కోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకి పెద్దలు చెప్పే అవకాశం లేకుండా పోయింది. 
 
ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, పూజా మందిరాన్ని అలంకరించి దైవాన్ని సేవించాలి. అలాంటివారి ఇంట్లోనే ధనలక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవని వారి ఇంట్లోను ... మధ్యాహ్నం - సాయంత్రం వేళల్లో నిద్రపోయే వారి ఇళ్లలోను లక్ష్మీదేవి ఉండకుండా వెళ్లిపోతుంది.
 
ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతుందో, అప్పుడు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దారిద్ర్యం అనారోగ్యానికి గురిచేసి అనేక కష్టాలకు ఆహ్వానం పలుకుతుంది. అందువల్లనే మన పూర్వీకులు అందరినీ ఉదయాన్నే నిద్రలేపేవాళ్లు ... వేళగాని వేళలో నిద్రపోనిచ్చేవాళ్లు కాదు.
 
ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో తమ ఆడపిల్లలను ... కోడళ్లను ఉదయాన్నే నిద్ర లేపడంలోని ఆంతర్యం ఇదే. తెల్లవారు జామున నిద్రలేవడంపైనే సంపదలు ... సంతోషాలు ఆధారపడి ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.