Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అపజయాలు లేని జీవితం ఒక జీవితమేనా?

సోమవారం, 14 మే 2018 (19:39 IST)

Widgets Magazine

నేను జీవితంలో అనేక తప్పులను చేశాను. కాని ఆ తప్పులలో ఏది లేకున్నా, నేను ఈ స్థితికి వచ్చివుండకపోయేవాణ్ణి అనడం నిస్సంశయం. కాబట్టి వాటికి నేను కృతజ్ఞుణ్ణి. అలాగని మిమ్మల్ని బుద్ధిపూర్వకంగా తప్పులను చేయమని చెప్పడం లేదు. కాని తప్పులను చేస్తే విలపించకు.
psychology
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్
 
2. జరుగవలసింది ఏదో జరిగిపోయింది. చింతించకు. జరిగిపోయిన కార్యాలను గూర్చి పదేపదే తలపోయకు. వాటిని నీవు రద్దు చేయలేవు. కర్మఫలం కలిగే తీరుతుంది. దానిని ఎదుర్కో... కాని చేసిన తప్పునే మరలా చేయకుండా జాగ్రత్త వహించు.
 
3. మనం చేసే పనులలోని తప్పులూ, పొరపాట్లే మనకు నిజంగా బోధను నేర్పుతాయి. తప్పులు చేసేవారే సత్యపథంలో విజయాన్ని సాధిస్తారు. చెట్లు తప్పులు చేయవు. రాళ్లు పొరపాట్లలో కూరుకోవు. జంతువులు ప్రకృతి నియమాలను అధిగమించడం సాధారణంగా చూడం. కానీ మనిషి తప్పులను చేసే అవకాశం ఉంది. మళ్లీ మనిషే భువిపై దైవంగా మారతాడు. 
 
4. పురోగమించు... యుగయుగాల సంఘర్షణ ఫలితంగానే సౌశీల్యం నిర్మితమవుతుంది. అధైర్య పడవద్దు. 
 
5. అపజయాలను లక్ష్యపెట్టకు. అవి వాటిల్లడం సహజం. ఈ అపజయాలు జీవితానికి అలంకారప్రాయాలు. ఇవి లేని జీవితమూ ఒక జీవితమేనా... పోరాటానికి సంసిద్ధం చేసేవి ఈ అపజయాలే కదా. ఇవే జీవిత సౌరభాలు. కాబట్టి ఈ పొరపాట్లను, ఈ పోరాటాలను లక్షించవద్దు. ఆవు అసత్యమాడదు నిజమే. కాని అది ఎప్పటికీ ఆవే... మనిషి కాలేదు. కాబట్టి అపజయాలచే నిరుత్సాహపడకండి. లక్ష్యసిద్ధికై వేయిసార్లు పోరాడండి. వెయ్యిసార్లు ఓటమి వాటిల్లినా, ఇంకొకసారి మళ్లీ ప్రయత్నించండి. 
 
6. వేల అవరోధాలను అధిగమించినప్పుడే సౌశీల్య నిర్మాణం సాధ్యమవుతుంది.
 
7. ఇతరుల దోషాల గురించి, వారెంత దుష్టులయినాసరే ఎన్నడూ ముచ్చటించకు. తద్వారా ఏ మేలు కలుగదు. ఒకరి తప్పులను ఎంచి అతనికి నీవు చేయగల సహాయం ఏదీ లేదు. అటువంటి పనుల వల్ల నీవు అతనికి హాని చేసి, నీకు నీవే హాని చేసుకుంటావు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

పాశుర ప్రభావం గురించి? ఎందుకు?

జీవితంలో స్తబ్దత నెలకొన్నపుడు తన గత వైభావాన్నీ, గడచిన మంచి రోజులనూ, భగవంతుని దయవలన ...

news

అసలు సాధన, ఆధ్యాత్మికతలే వాస్తవం కాదనే దృష్టికొస్తారు

మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాము. ఆ కష్టం తొలగినపుడు భగవంతుడిని ...

news

కృష్ణ భగవానుని నుంచి అది నేర్చుకోవాలి...

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. మనుషులు రకరకాల తరహాలలో ఉంటారు. ఆత్మ యొక్క స్థితిలో, పరిణామ ...

news

హనుమాన్ జయంతి వేడుకలు.. కాషాయమయమైన ఆలయాలు

హనుమాన్ జయంతి వేడుకలు సంబరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలు భక్తులతో ...

Widgets Magazine