1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (14:19 IST)

గందరగోళపు ఆలోచనలను వదిలించుకోవాలంటే?

గందరగోళపు ఆలోచనలను వదిలించుకోవాలంటే? చదవండి. సద్గురు సందేశం. గందరగోళపు ఆలోచనల నుంచి తప్పకుండా విముక్తి కలుగుతుంది. జీవితకాలంలో ఇది సాధ్యమే. అయితే అది సాధ్యమయ్యేలా మీరు చేయాలి. గందరగోళపు ఆలోచనలు వదిలించుకునే ప్రయత్నం మీరు చేయాలి. అదే జీవిత లక్ష్యంగా కృషి చేయాలి.
 
మీ శరీరంలోని మనసులోని శక్తియుక్తులన్నింటిని ఒకే ఒక అంశం మీదకు మళ్ళించినప్పుడు ఏదైనా అందుకోవటం సాధ్యమే. మీరు కోరుకునే ముక్తి మరెక్కడో లేదు, అది మీలోనే ఉంది. మీరు ప్రయత్నం చేస్తే ఎలాంటి అడ్డంకులు ఉండవు. 
 
జ్ఞానం అనేది సాధించగలరు. అయితే ఆ యత్నంలోమీ మనసులో ఉన్న వ్యతిరేక పొరలను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ రావాలి. అప్పుడే జ్ఞానోదయం అవుతుంది. నేటివరకు మీరు గడిపిన జీవితం, మీరు చూసిన లోకం ఎంత అర్థం లేనిదో బాగా తెలుస్తుంది.