బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (22:38 IST)

స్త్రీకి అలా సర్వశక్తులు సంక్రమిస్తాయి (video)

wedding
వివాహమైన స్త్రీకి... తల్లిదండ్రులు, అత్తమామలు, బావగారు, మరుదులు, అక్కలు, చెల్లెళ్లు, వదినా మరదళ్లు, అఖరికి దైవం కూడా తన భర్తకి తర్వాతే. భర్త దైవాన్ని దర్శించవద్దంటే నా ఇష్టమనే భార్య శాశ్వత నరకానికి పోతుంది. మీ ఇష్టం అనే భార్య త్రిమూర్తులను తన భర్తలోనే దర్శిస్తుంది.

 
పొరబాటున త్రిమూర్తులు, లేదా జగన్మాత ప్రత్యక్షమై నీకేం వరం కావాలని కోరితే... నిజమైన భర్త సౌఖ్యము, సంతోషం కోరుకుంటుందే తప్ప అన్యములు ఆశించదు. ఇవన్నీ తనకు తన భర్త సేవనంలోనే సంప్రాప్రిస్తున్నాయనే ఆమె, మీరు గతులు తప్పకుండా వుండటానికి కావలసిన వరం తప్పక నేనే ఇస్తానని చెప్పగల సర్వ సమర్థరాలు ఆ పతివ్రతామ తల్లి. 

 
గురువును సేవించిన పురుషుడు ఎంతటి ఉత్తముడో, పతియే దైవంగా తలచిన స్త్రీ అంతటి శక్తివంతురాలు. పురుషుడికి గురువు, స్త్రీకి పతి ద్వారా సర్వశక్తులు సంక్రమిస్తాయి.