శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (15:35 IST)

నిద్రిస్తున్న స్త్రీతో శృంగారం, పురాణాల్లో ఏం చెప్పబడింది?

ప్రస్తుత సమాజంలో శృంగారం అనేది పరస్పర ఇష్టాలతో పాటు ఇష్టం లేకుండా బలవంతంగా జరుగుతున్నవి వున్నాయి. ఈ విషయంలో పురుషుడి వల్ల స్త్రీ చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. అసలు శృంగారం గురించి పురాణాలను ఒకసారి పరిశీలిస్తే... ఒకరితోకన్నా ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఆనాడు అనుమతించారు. 
 
పురుషులు పలువురు భార్యలను కలిగి వుండేందుకు ఆమోదముంది. ద్రౌపది ఐదుగురు భర్తలతో నివశించగల్గింది. ప్రపంచంలో మనం చూస్తున్న అన్ని రకాల స్త్రీ, పురుష లైంగిక సంబంధాలు మన పురాణాలలో కనిపిస్తాయి. అన్ని రకాల మనస్తత్వాలను మనవారు ముందుగానే ఊహించి కల్పితగాధలు సృష్టించారా లేక అది వాస్తవ చిత్రీకరణా అనేది వేరే సంగతి. 
 
అలాగని స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక సంబంధానికి అనుమతి లేదు. ఒక స్త్రీతో బలవంతపు సంబంధం రాక్షసత్వంగాను, పాపంగానూ ప్రకటించారు. పరాయి స్త్రీమీద వ్యామోహం అసలు మంచిది కాదు. అటువంటి మోహితుడికి ఎటువంటి పతనం ప్రాప్తిస్తుందో తెలియచెప్పినదే రామాయణంలోని రావణుడి పాత్ర. 
 
స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగానే కాదు నిద్రిస్తున్న స్త్రీ, మత్తుతో వున్న స్త్రీతో లైంగిక అనుభవం నిషేధించింది ఆనాటి సమాజం. తనను తాను రక్షించుకోలేని పరిస్థితిలో వున్న మహిళ మీద, అనారోగ్యంతో వున్న స్త్రీమీద లైంగిక వ్యామోహం నిషిద్ధం. అటువంటి నిషేధిత లైంగిక సంబంధాలను ఆశించే వారు నరకానికి పోతారని చెప్పబడింది. 'మనుస్మృతి'లో ఇటువంటి నిషేధిత సంబంధాలు, నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి విధించదగిన శిక్షలను ప్రస్తావించారు.