గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (13:59 IST)

నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.. కదిలే శివలింగం గురించి మీకు తెలుసా?

కదిలే శివలింగం గురించి మీరెప్పుడైనా విన్నారా? అయితే ఇది నిజం. శివలింగాలను దర్శించుకోవడం.. పూజలు చేయడం మామూలే. అయితే శివుడు.. శివలింగ దర్శనం శుభానికి సంకేతమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే రాజస

కదిలే శివలింగం గురించి మీరెప్పుడైనా విన్నారా? అయితే ఇది నిజం. శివలింగాలను దర్శించుకోవడం.. పూజలు చేయడం మామూలే. అయితే శివుడు.. శివలింగ దర్శనం శుభానికి సంకేతమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే రాజస్థాన్‌లోని శివలింగం మాత్రం కదులుతూ ఉంటుందట. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కదిలే శివలింగంతో కూడిన ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని రుద్రపూర్‌లో ఉంది. 
 
రుద్రపూర్‌లో ఎన్నో కోటలు, రాజభవనాలున్నా.. కదిలే లింగంతో కొలువైన దుగ్దేశ్వరనాథ్ ఆలయం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయంలోని శివ లింగాలన్నీ స్వయంభు లింగాలే. దేశంలోని అన్ని శివాలయాల్లో శివలింగం పానమట్టం మీద ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం భూమి మీద ప్రతిష్టించబడి ఉంటుంది. ఇక ఈ శివలింగం కదులుతూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకసారి కాదు.. చాలాసార్లు కదులుతూనే ఉంటుంది. కానీ ఈ శివలింగం కదలటం ఆగిపోతే మాత్రం ఎవరు ఎంత కదిలించినా శివలింగం కదలదట. 
 
ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ  సంఖ్యలు భక్తులు క్యూ కడుతున్నారు. ఇక ఈ శివలింగం ఎందుకలా కదులుతుందని తెలుసుకునేందుకు చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. కానీ ఎంత తవ్వినా శివలింగం పొడవు కనిపిస్తుందే కానీ.. శివలింగం కదిలేందుకు కారణం మాత్రం తెలియట్లేదు. భక్తులు మాత్రం ఆ శివుడే ఇక్కడ కొలైవై ఉన్నాడని విశ్వసిస్తున్నారు.