గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 మార్చి 2015 (19:21 IST)

అంతర్వేది నరసింహస్వామి ఆలయంలో నిద్ర చేస్తే..?

నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది సన్నిధానంలో ఓ రాత్రి నిద్రచేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. సాధారణంగా నరసింహస్వామి క్షేత్రమనగానే అది అత్యంత శక్తిమంతమైనదిగా అందరూ భావిస్తారు. అలా నరసింహస్వామి లక్ష్మీసమేతంగా ఆవిర్భవించిన క్షేత్రంగా అంతర్వేది అలరారుతోంది. తూర్పుగోదావరి జిల్లా 'సఖినేటిపల్లి' మండలంలో గల ఈ క్షేత్రంలో అడుగడుగునా అనేక విశేషాలు కనిపిస్తూ వుంటాయి. 
 
దేవతలు, మహర్షులు నడయాడిన పుణ్యస్థలంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల మనోభీష్టం తప్పక నెరవేరుతుంది. ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతోన్న దంపతులకు సంతానాన్ని అనుగ్రహించడం ఇక్కడి స్వామివారి ప్రత్యేకతగా చెబుతుంటారు.
 
సంతానలేమితో బాధపడుతోన్న దంపతులు స్వామివారిని దర్శించి, ఆ రాత్రి ఇక్కడ నిద్ర చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన దంపతుల కోరిక నెరవేరుతుందని విశ్వసిస్తుంటారు.