శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (14:27 IST)

తిరుమల కపిలేశ్వర స్వామికి 12న ఘనంగా అన్నాభిషేకం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 12వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
 
ఈ సందర్భంగా ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు అన్నాభిషేకం, అలంకారం ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం సహస్రనామార్చన, దీపారాధన చేపడతారు. 
 
సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 నుండి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా తెల్లవారుజామున 5.15 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారని తిరుమల తిరుపతి ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో వెల్లడించారు.