గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 12 నవంబరు 2021 (19:36 IST)

శ్రీవారి భక్తుల అన్నదానానికి కోటి విరాళం

నెల్లూరు పట్టణానికి చెందిన కాంట్రాక్టరు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎపి చైర్మన్, భవాని కన్స్ట్రక్షన్స్ ఎండి శ్రీ పంకజ్ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ. 1, 00,10,116 ( కోటి పది వేల నూట పదహారు) విరాళం అందించారు.
      
తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనంలో ఆయన ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్యతో పాటు ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని కలసి ఈ మేరకు డిడిని అందించారు. కార్యక్రమంలో శ్రీ పంకజ్ రెడ్డి సతీమణి శ్రీమతి సరిత పాల్గొన్నారు.