సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (11:45 IST)

తిరుమలకు క్యూకట్టిన భక్తులు ... ఎందుకు?

తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. ఉచిత దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు ఇస్తున్నవార్త తెలియడంతో భక్తులు తిరుమలకు క్యూకట్టారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత రోజుకు 6 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇపుడు దర్శనాల సంఖ్యను కూడా పెంచారు. రోజుకు మూడు వేల మందికి ఉచిత దర్శనం టోకెన్లను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న టీటీడీ, అలిపిరిలోని భూదేవీ కాంప్లెక్సులో ప్రత్యేక కౌంటరును ఏర్పాటుచేసింది. 
 
శుక్రవారం ఉదయం టికెట్లను జారీచేయనున్నామని ప్రకటన వెలువడగానే, భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరికి చేరుకున్నారు. భక్తులంతా భౌతికదూరం నిబంధనలు పాటించేలా చూసేందుకు అధికారులు తల పట్టుకోవాల్సి వచ్చింది. 
 
ఈ నెల 30 వరకూ టికెట్లను జారీ చేశామని, వచ్చే నెల 11 వరకూ ఆన్‌లైన్ కోటా టికెట్ల పూర్తయిందని, ఆపై టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.