Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీవారికి తేలికైన సర్వభూపాలవాహనం.. 16 అడుగుల ఎత్తు.. 9 కిలోల బంగారంతో?

మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:25 IST)

Widgets Magazine
sarva bhoopala vahanam

కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తుంటారు. ఇంకా టీటీడీ కూడా శ్రీవారికి కొన్ని వాహనాలు, ఆభరణాలను చేయిస్తుంది. తాజాగా శ్రీవారి వాహనాల్లో సరికొత్త సర్వభూపాల వాహనం చేరింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఉపయోగిస్తున్న సర్వభూపాల వాహనం బరువుగా ఉండటంతో.. కొత్త వాహనాన్ని రూపొందించారు. 
 
తమిళనాడుకు చెందిన కల్యాణ సుందరం అనే నిపుణుడి కార్మికుల ఆధ్వర్వంలో ఈ వాహనం రూపుదిద్దుకుంది. రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ కొత్త సర్వభూపాల వాహనంపై స్వామివారు తిరుమాడవీధుల్లో ఊరేగనున్నారు. 
 
ఇప్పటివరకు శ్రీవారు ఊరేగిన సర్వభూపాల వాహనం బరువుతో పాటు.. దానిపై మలయప్ప స్వామి ఊరేగుతున్న వేళ... భక్తులకు సరైన దర్శనం లభించలేదని ఫిర్యాదు అందడంతో కొత్త వాహనాన్ని రూపొందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ వాహనం 16 అడుగుల ఎత్తును కలిగివుంటుంది. ఈ వాహనానికి తొమ్మిది కిలోల బంగారంతో తాపడం పనులు చేయించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

7న తిరుమల ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీనికి కారణం ఎంటో తెలుసా? ...

news

కాలజ్ఞానం ప్రకారం శ్రీవారి ఆలయం వందేళ్లు వెనక్కి.. ఎవరన్నారు?

దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా ...

news

చచ్చేవాడి చెవిలో 'నారాయణ... నారాయణ' అని ఇంకా ఎందుకు?

మనవాళ్లు చాదస్తులు, గుడ్డినమ్మకం కలవారు అనుకున్నంత కాలం వారి అలవాట్లు, ఆచారాలు, వెర్రిగా ...

news

అద్భుతం.. అలివేలు మంగమ్మ వరలక్ష్మి వ్రతం(వీడియో)

తిరుమల వెంకన్న పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి మహోత్సవం ...

Widgets Magazine