Widgets Magazine

గ్రహణ గండాలకు అతీతం : కాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు

శుక్రవారం, 27 జులై 2018 (12:12 IST)

సాధారణంగా సూర్య, చంద్రగ్రహణాల సమయాల్లో చిన్నపాటి ఆలయాలతో పాటు.. ప్రసిద్ధ ఆలయాలను మూసివేయడం జరుగుతుంది. గ్రహణం ప్రారంభమయ్యే సమయం నుంచి గ్రహణం వీడిపోయేంత వరకు అన్ని రకాల పూజలు నిలిపివేయడమే కాకుండా ఆలయాలను కూడా మూసివేస్తుంటారు.
 
కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం దీనికి అతీతం. ఇక్కడ గ్రహణ గండాలకు అతీతంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. శుక్రవారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు అన్ని ఆలయాల తలపులు మూసివేయనున్నారు. 
 
కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచనున్నారు. దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా పేరున్న శ్రీకాళహస్తీలో ఎప్పుడు గ్రహణం పట్టినా…. ఆలయాన్ని తెరిచే ఉంచి ప్రత్యేక పూజలు చేయడం ప్రత్యేకత. ఇక్కడ ప్రత్యేకంగా గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. 
 
రాత్రికి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ముక్కంటికి గ్రహణ కాల అభిషేకాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్థరాత్రి ఒంటి గంటకు సంకల్ప పూజలు ప్రారంభించి ఉదయం 3 గంటల్లోపు అభిషేకాలు పూర్తి చేసేలా వేదపండితులు ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో భక్తులను కూడా అనుమతిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

సంపూర్ణ చంద్రగ్రహణం : శ్రీవారి ఆలయం మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇందులోభాగంగా, ...

news

వీళ్లు మారరు... శ్రీవారి దర్శన సమయంలో అదే గందరగోళం...

శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16 దాకా పరిమితి సంఖ్యలో భక్తులను ...

news

ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలో తెలుసా?

ఉదయాన్నే నిద్రలేవగానే ఆవును గాని, అద్దాన్ని గాని, తల్లిదండ్రులను గాని, భార్యనుగాని చూడడం ...

news

శబరిమల ఆలయంలోకి మహిళలా..? అయ్యప్ప స్వామి బ్రహ్మచారి- నాయర్ సొసైటీ

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రాజ్యాంగ ...

Widgets Magazine