మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (19:16 IST)

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

tirumala
టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో మాదిరిగా మళ్లీ శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్‌లను ప్రారంభించినట్లు తెలుస్తొంది. గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించినట్లు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. అందుకే ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 
 
ప్రతి రోజూ 900 శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తొంది.

గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుంచి నాలుగు నిమిషాలు పట్టేదని.. ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు.